మొక్కలు గాలిని శుద్ధిచేస్తాయి, మనసుని ఉత్సాహపరుస్తాయి, పర్యావరణాన్ని పరిరక్షిస్తాయి. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని రకాల మొక్కలు ఇంటి ఆవరణలో ఉండకూడదని చెబుతున్నారు వాస్తు నిపుణులు. ముఖ్యంగా అరటి చెట్టు ఎక్కడ నాటాలో కొన్ని సూచనలు చేస్తున్నారు.
అరటి చెట్టు ఇక్కడ నాటండి
తులసి లేదా అరటి మొక్కను సాధారణంగా ఇళ్లలో నాటుతారు. సనాతన ధర్మంలో మత విశ్వాసాల ప్రకారం ఇంట్లో అరటి మొక్కను నాటడం వలన గురుగ్రహానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఇంట్లో ఎలాంటి సంక్షోభం వచ్చినా దూరం అవుతుంది.ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. రుణాల తీరి ఆర్ధిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంట్లో అరటి చెట్టును నాటడం ద్వారా బృహస్పతి జాతకంలో బలపడతాడు. అయితే ఇంటి ముందు భాగంలో అరటి చెట్టును ఎప్పుడూ పెంచకూడదు. ఇది జీవితంలో సమస్యలను కలిగిస్తుంది. అయితే ఇంటి వెనుక భాగంలో అరటి మొక్కను పెంచుకోవచ్చు.
టెర్రస్ పై అరటి చెట్టు ఉండొచ్చా
ఇప్పుడంతా టెర్రస్ గార్డెన్ ట్రెండ్ నడుస్తోంది. టెర్రస్ పై అన్ని మొక్కలు మాత్రమే కాదు చెట్లు కూడా పెంచేస్తున్నారు. అయితే ఇంటి పైకప్పుపై అరటి చెట్టును నాటితే.. అది మీ జీవితంలో సంతోషం కంటే సమస్యలను తెస్తుంది. ఇంటి ఆర్థిక పరిస్థితి మరింత దిగజారవచ్చు. కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. ఆకస్మిక ఇబ్బందులను ఎదుర్కునే అవకాశం ఉంది. అందుకే ఇంటి ఆవరణలో కానీ, ప్రహరి లోపల కానీ అరటి చెట్టు ఉండకూడదు. ప్రహరి గోడ బయట ఉండొచ్చు లేదంటే ఇంటి వెనుక భాగంలో అరటి చెట్టు నాటొచ్చు.
అరటి మొక్క నాటేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి
ఇంట్లో అరటి మొక్కను నాటితే ఈ మొక్క దగ్గర తులసి మొక్కను నాటడం తప్పనిసరి . ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది
వాస్తు ప్రకారం అరటి మొక్కను ఇంటికి ఆగ్నేయ దిశలో నాటకూడదు. ఇంటి మెయిన్ డోర్ ముందు అరటి మొక్కను ఎప్పుడూ నాటకండి. గులాబీ లాంటి ముళ్లు ఉండే మొక్కలను అరటి దగ్గర ఉంచకూడదు. కుళ్ళిన లేదా ఎండిన ఆకులను వీలైనంత త్వరగా తొలగించండి. అరటి మొక్కకు ఎప్పుడూ శుభ్రమైన నీటిని పెట్టాలి. బాత్రూమ్ వ్యర్థాలు లేదా ఉపయోగించిన నీటిని అరటి మొక్కకు పోయొద్దు
గమనిక: కొందరు పండితుల నుంచి, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.