కూకట్‌పల్లిలో జనసేనకు చాన్స్ ఎంత ? టీడీపీ పోటీ చేయకపోవడం కలిసి వస్తుందా ?

జనసేన , బీజేపీ పొత్తులో భాగంగా కూకట్ పల్లి నుంచి జనసేన పార్టీ పోటీ చేస్తోంది. కూకట్ పల్లి తెలంగాణ లోనే ప్రత్యేకమైన నియోజకవర్గం. అత్యధిక మంది సెటిలర్లు అదీ కూడా ఆంధ్రా నుంచి వచ్చిన వారు ఉన్న నియోజకవర్గంగా పేరు ఉంది. గత మూడు ఎన్నికల్లో గెలిచిన పార్టీ గెలవలేదు. ఓ సారి లోక్ సత్తా.. మరో సారి టీడీపీ.. మరోసారి బీఆర్ ఎస్ గెలిచింది. పార్టీ మారి .. రెండు సార్లు మాధవరం కృష్ణారావే గెలిచారు. గత ఎన్నికల్లో టీడీపీ రెండో స్థానంలో ఉంది. ఈ సారి ఆ పార్టీ పోటీ చేయడం లేదు. మరి ఇప్పుడు కూకట్ పల్లిలో ఎవరు హాట్ ఫేవరేట్ ? జనసేనకు ఎంత స్కోప్ ఉంది.

కూకట్‌పల్లి జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్

కూక‌ట్‌ప‌ల్లి స్థానం నుంచి జనసేన తరపున ప్రేమ్ కుమార్ రంగంలోకి దిగుతున్నాు. ఆయన హైదరాబాద్ కి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, వెస్ట్ జోన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు. ఆర్థికంగా బలంగా ఉండ‌డంతోపాటు.. సామాజిక వ‌ర్గం ప‌రంగా కూడా ప్రేమ్‌కుమార్ కు కూక‌ట్ ప‌ల్లి వంటి కీల‌క టికెట్ ఇవ్వ‌డంతో జ‌న‌సేన‌లో జోష్ పెరుగుతోంది. ప్రేమ్‌కుమార్‌కు ప‌వ‌న్‌కు మ‌ధ్య స్నేహం ఉంద‌ని.. ఎప్ప‌టి నుంచో ఇద్ద‌రి మ‌ధ్న ప‌రిచ‌యం కూడా ఉంది. ఆయనలో నాయకత్వ లక్షణాలను గుర్తించి టిక్కెట్ ఇచ్చారు. ఆర్థికంగా కూడా లోటు లేని వ్యక్తి.

బీజేపీకి కూకట్ పల్లిలో బలమైన ఓటు బ్యాంక్

కూకట్ పల్లి నియోజకవర్గంలో బీజేపీకి పాతిక వేల వరకూ ఓటు బ్యాంక్ ఉంది. టీడీపీ, బీజేపీ కూటమిగా పని చేసినప్పుడు .,.. టీడీపీకి యాభై వేల మెజార్టీ వచ్చింది. తర్వాత బీజేపీ మద్దతు లేనప్పుడు విజయం సాధించలేకపోయింది. బీజేపీ విడిగా పోటీ చేసి ఇరవై వేల ఓట్ల వరకూ సాధించింది. ఇప్పుడు బీజేపీ క్యాడర్ జనసేన కోసం పని చేయనుంది. పవన్ కల్యాణ్ ఇప్పటి వరకూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అందుకే.. జనసేనాని క్రేజ్ తో పాటు.. బీజేపీ క్యాడర్ కలిస్తే… బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇవ్వవొచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది.

టీడీపీ సానుభూతిపరులు మద్దతిస్తే భారీ విజయం

టీడీపీ పోటీ చేయకపోవడంతో జనసేనకు ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు ఉండటం వల్ల ఆ జనసేన పార్టీ తరపున కూకట్ పల్లిలో పోటీ చేసే అభ్యర్థికి మద్దతిచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే జనసేన అభ్యర్థి భారీ విజయం సాధిస్తారు. ఇప్పటికైతే.. కూకట్ పల్లిలో ముక్కోణపు పోటీ