2019 పరువు నష్టం కేసులో.. సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో శిక్ష విధించిన తర్వాత.. రాహుల్ పార్లమెంటు దిగువ సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన ప్రచార కార్యక్రమంలో.. Rahul Gandhi ప్రసంగిస్తూ ‘మోదీ’ అనే ఇంటిపేరును ఉపయోగించి చేసిన వ్యాఖ్యలు కోర్టుల వరకు వెళ్లాయి. ఈ కేసు కారణంగానే రాహుల్‌పై అనర్హత వేటు పడింది.
ఎంపీగా అనర్హత వేటు పడిన నేపథ్యంలో.. తన ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాల్సిందిగా కోరుతూ లోక్‌సభ సెక్రటేరియట్ మార్చి 27న రాహుల్ గాంధీకి నోటీసు జారీ చేసింది. నోటీసు ప్రకారం.. ప్రభుత్వ బంగ్లా కేటాయింపు ఏప్రిల్ 24 నుంచి అమలులోకి వస్తుంది. ఈ నేపథ్యంలో.. రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇదే అంశంపై తాజాగా.. హనుమాన్‌గర్హి పుణ్యక్షేత్రం ప్రతినిధి మహంత్ సంజయ్ దాస్ (Mahant Sanjay Das) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మేము రాహుల్ గాంధీని హనుమాన్‌గర్హి, అయోధ్యలోకి స్వాగతిస్తాము. ఆయన ఇక్కడికి వస్తే మా స్థానాన్ని ఆయనకు అందజేస్తాం’ అని దాస్ వ్యాఖ్యానించారు. మహంత్ సంజయ్ దాస్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.