Spirituality: ఇంట్లో ఏం జంతువుల బొమ్మలుంటే ఎలాంటి ఫలితం కలుగుతుంది!

పూజకోసం కొందరు ఇంటి అలంకారం కోసం మరికొందరు ఇంట్లో జంతువుల విగ్రహాలను పెడుతుంటారు. కొన్ని జంతువుల విగ్రహాలు ఆందాన్నిస్తే మరికొన్ని జంతువుల విగ్రహాలు ఆధ్యాత్మికతను పంచుతాయి, ఇంట్లో సానుకూల శక్తి ఏర్పడేలా చేస్తాయి. ఎందుకంటే వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి జంతువు ఏదో ఒక గ్రహంతో ముడిపడి ఉంటుంది, ఏదో దేవుడికి వాహనంగా ఉంటుంది. అందుకే మన ఇంట్లో ఉండే జంతువుల విగ్రహాలు లేక బొమ్మలు మనపై కూడ ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా కొన్ని విగ్రహాల వలన ఇంట్లో సానుకూల శక్తి పెరిగి ఆర్థిక స్థితి మెరుగుపడుతుందంటారు వాస్తు శాస్త్ర నిపుణులు. మరి ఇంట్లో ఏ జంతువుల బొమ్మలుంటే శుభప్రదమో తెలుసుకుందాం.

ఏనుగు విగ్రహాలు
వాస్తు ప్రకారం ఇంట్లో జత ఏనుగులను ఉండటం వలన శుభప్రదం, కుటుంబంలో ఐక్యత ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వాస్తు ప్రకారం, ఇంట్లో వెండి లేదా ఇత్తడి ఏనుగును ఉంచడం ఇంకా మంచిది.

తాబేలు
తాబేలును శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు. శ్రీ మహావిష్ణువు తాబేలుగా ఉ్నన ఏకైక దేవాలయం శ్రీ కూర్మం. తాబేలు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి తిష్ఠ వేసుకుని కూర్చుంటుందని చెబుతారు. తాబేలుని ఇంట్లో తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచితే సిరిసంపదలు కలుగుతాని వాస్తు పండితులు చెబుతారు.

చేప
చేప సంపద, శక్తికి చిహ్నం. ఇంట్లో ఇత్తడి లేదా వెండి చేపలను ఈశాన్య లేదా తూర్పు దిశలో ఉంచడం వల్ల ఆనందం, శ్రేయస్సులతో పాటు సంపద వస్తుంది. ఇంకా చెప్పాలంటే హిందూ పురాణాల ప్రకారం విష్ణుమూర్తి 9 అవతారాల్లో మత్స్యావతారం ఒకటి. సైన్స్ పరంగా చూస్తే చేపలు..నెగెటివ్ తరంగాలను తమలో ఇముడ్చుకుని అనుకూల తరంగాలను బయటికి విడుదల చేస్తుందట.

ఆవు
పురాణాల ప్రకారం ఆవులో అన్ని దేవతలు ఉంటారని హిందువుల విశ్వాసం. అందుకే ఇంట్లో ఆవు విగ్రహాన్ని ఉంచడం వల్ల సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు కలిగి ఉంటారని విశ్వాసం

ఒంటె
ఒంటె పోరాటం విజయానికి చిహ్నం. డ్రాయింగ్ రూమ్ లేదా లివింగ్ రూమ్‌లో వాయువ్య దిశలో ఒంటె విగ్రహాన్ని ఉంచడం వల్ల కెరీర్ లేదా వ్యాపారంలో విజయం లభిస్తుంది

గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం