ప్రత్యక్ష దైవం సూర్యుడు. ఒకడే సూర్యుడు కనిపిస్తాడు..మరి…ద్వాదశ ఆదిత్యులు అని ఎవర్ని పిలుస్తారు? వారి పేర్లేంటో తెలుసుకుందాం…
ద్వాదశ ఆదిత్యులు ఎవరు
హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యాధనకు ఎంతో విశిష్టత ఉంది. పన్నెండు నెలల కాలంలో సూర్యుడు ఉండే స్థితులను బట్టి ద్వాదశాదిత్యుల పేర్లతో వర్ణించారు. మహాభాగవతం 12వ స్కంధం చివరిలో ద్వాదశాదిత్యుల వర్ణ ఉంది. ఒక్కొక్క నెలలో సూర్య భగవానుడు ఆయా ఆదిత్యుని నామంతో పూజలందుకుంటాడు. సూర్యుడి వెంట ఉండే ఆరుగురు పరిజనులు కూడా నెలని బట్టి మారుతుంటారు.
మహాభారతం, ఆదిపర్వంలో ఉన్న శ్లోకం ఇది
ధాతా మిత్రః ఆర్యమా శక్రో వరుణ స్త్వంశ ఏవచ
భగో వివస్వాన్ పూషా చ, సవితా దశమస్తథా
ఏకాదశస్తథా త్వష్టా, ద్వాదశో విష్ణురుచ్యతే
జఘన్యజస్తు సర్వేషా మాదిత్యానా గుణాధికః
(ధాత, మిత్ర, ఆర్యమ, శక్ర, వరుణ, అంశ, భగ, వివస్వాన్, పూష, సవిత, త్వష్ట, విష్ణువు)
ఏ నెలలో సూర్యుడిని ఎలా పిలుస్తారు…
- చైత్ర మాసంలో వచ్చే సూర్యుడి పేరు ‘ధాత’
- వైశాఖంలో అర్యముడు
- జ్యేష్టం-మిత్రుడు
- ఆషాఢం-వరుణుడు
- శ్రావణంలో ఇంద్రుడు
- భాద్రపదం-వివస్వంతుడు
- ఆశ్వయుజం-త్వష్ణ
- కార్తీకం-విష్ణువు
- మార్గశిరం- అంశుమంతుడు
- పుష్యం-భగుడు
- మాఘం-పూషుడు
- ఫాల్గుణం-పర్జజన్యుడు
ఆ నెలల్లో సూర్యుడి తీక్షణతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు.
సూర్యకాంతి ఏడు వర్ణాల కలయిక అని వైజ్ఞానికులు చెబుతుంటే ఆయన ఏడు గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేదవాజ్మయం చెబుతోంది. ఆ ఏడు గుర్రాల పేర్లు
- గాయత్రి, 2. త్రిష్ణుప్పు, 3. అనుష్టుప్పు, 4. జగతి, 5. పంక్తి, 6. బృహతి, 7. ఉష్ణిక్కు వీటి రూపాలు సప్త వర్ణాలకు సరి పోలుతాయి.
గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.