భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ. దేశంలో అయితే తిరుగులేని పార్టీ. ఆ పార్టీ కోసం సోషల్ మీడియాలో స్వచ్చందంగా ఎంతో మంది పని చేస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లోనూ.. ఆంధ్రప్రదేశ్ లోనూ ఉంటారు. అయితే చాలా మంది తాము బీజేపీ కోసం సోషల్ మీడియాలో ప్రచారం చేద్దామనుకున్నా..ఎలా ముందుకెళ్లాలో తెలియని వారు ఉన్నారు. వారందరికీ ఇప్పుడు బీజేపీ ఆహ్వానం పలుకుతోంది. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్స్ గామారేందుకు.. బీజేపీ ప్రత్యేకంగా ఓ సమావేశం నిర్వహిస్తోంది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో .. బీజేపీ తరపున ప్రజలకు నిజాలు చెప్పి.. జాతీయత పెంచేందుకు ఇన్ ఫ్లూయన్సర్స్ గా మారేందుకు సానుభూతిపరులకు అవకాశాలు కల్పిస్తారు.
సోషల్ మీడియా ఇన్ ఫ్లూయర్స్ మీటింగ్ నిర్వహిస్తున్న ఏపీ బీజేపీ
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే విష్ణువర్థన్ రెడ్డి నేతృత్వంలో సోషల్ మీడియా విభాగం పని చేస్తోంది. ఎన్నికల సమయంలో మరింతగా సోషల్ మీడియా వింగ్ ను బలోపేతం చేసి.. పార్టీ సానుభూతిపరులైన ఇన్ ఫ్లూయన్సర్స్ కు మరింత సమాచారం అందించేలా చేయడం కోసం సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో పాల్గొనాలనుకునేవారు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. http://saffronwarriors.com/ వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకుంటే పాస్ జనరేట్ అవుతుంది. అందులో అన్ని వివరాలు ఉంటాయి. వాటిని తీసుకుని సమావేశానికి రావొచ్చు.
మోదీ నాయకత్వంలో పని చేసే వారి కోసం ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్లో బీజేపీ క్రమంగా బలోపేతం అవుతోంది. అయితే కొత్త తరం అంతా ఎక్కువగా సోషల్ మీడియాలోనే ఉంటుంది. వారి ఆలోచనల్ని ఎక్కువగా సోషల్ మీడియా సైన్యాలు ప్రభావితం చేస్తున్నాయి. అందుకే సాఫ్రన్ వారియర్స్ కు ఏపీ బీజేపీ శ్రీకారం చుట్టింది. గ్రామాలు, నియోజకవర్గాల వారీగా ఇన్ ఫ్లూయన్సర్స్ కు .. బీజేపీ ప్రాధాన్యం కల్పిస్తుంది. ఇలాంటి వారికి ముందు ముందు రాజకీయంగానూ అవకాశాలు కల్పిస్తారు.
http://saffronwarriors.com/ లో రిజిస్టర్ చేసుకోవాలి…!
ఇప్పటికే బీజేపీ తరపున గట్టి వాయిస్ సోషల్ మీడియా లో వినిపిస్తున్న వారు కూడా ఈ సమావేశానికి హాజరు కావొచ్చు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశాన్ని ప్రపంంచలో ఆజేయశక్తిగా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నంలో అశ్రువొక్కటి ధారబోద్దాం అనుకునే యువతుక ఏపీ బీజేపీ స్వాగతం పలుకుతోంది. http://saffronwarriors.com/ రిజిస్ట్ర చేసుకుంటే 29వ తేదీన మీటింగ్కు హాజరు కావొచ్చు.