పర్మినెంట్ చేయకపోతే వాలంటీర్లు ప్రభుత్వంపై తిరగబడాలి – ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి పిలుపు

వాలంటీర్లపై అమితమైన ప్రేమను ఒలకబోస్తున్న వైఎస్ఆర్‌సీపీ నిజాయితీ ఉంటే తక్షణం ఆ వ్యవస్థ ను.. వాలంటీర్లను పర్మినెంట్ చేయాలని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థపై ఎక్కడలేని ప్రేమను ఒలక బోయడం చూస్తే హాస్యాస్పదంగా ఉందన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన విష్ణువర్ధన్ రెడ్డి పలు కీలక అంశాలపై స్పందించారు.

గ్రామ పంచాయతీ నిధులపై శ్వేతపత్రం ప్రకటించాలి : విష్ణువర్ధన్ రెడ్డి

పరిపాలించమని ప్రజలు ఆధికారం ఇస్తే.. వారి దగ్గరున్న అధికారాలన్ని లాగేసుకుని వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేయడం ఖచ్చితంగా ప్రజాద్రోహమేనని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీలో 4సం.ల వైసీపీ పాలన గురించి చెప్పే వైసీపీ నేతలు 151 ఎమ్మెల్యేల బలం ప్రజలు ఇచ్చారని చెబుతున్న మాటలు వింటుంటే విడ్డురంగా ఉంది. రాష్ట్రంలో పంచాయతీ రాజ్ వ్యవస్థపై వైసీపీ ప్రభుత్వం చూపిస్తున్న ధోరణిని చూస్తే బాధేస్తుంది. సర్పంచుల హక్కులను వైసీపీ ప్రభుత్వం కాలరాస్తోంది. రాష్ట్రంలో ఉన్న సర్పంచులు , ఇతర ప్రజాప్రతినిధులు అదేవిధంగా మీ హక్కులు కాలరాస్తే చూస్తూ ఊరుకుంటారా ? అని ప్రశ్నించారు. పంచాయితీ రాజ్ వ్యవస్థలో సర్పంచుల కోట్ల నిధులను దారి మళ్ళించిన సంగతి ప్రజలు చూస్తూనే వున్నారని.. పర్మినెంట్ సీఎం అనే భ్రమలో ఉన్నారేమో కానీ.. ప్రజలు ఐదేళ్లకు మాత్రమే అవకాశం ఇచ్చిన తాత్కలిక ముఖ్యమంత్రి అనే సంగతిని గుర్తుంచుకోవాలి. ప్రజలు , ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పర్మినెంట్ … మరో 9 నెలలలో మిమ్మల్ని ప్రజలు సాగనంపుతారని గుర్తుంచుకోవాలన్నారు. వాలంటీర్ వ్యవస్థను పెట్టి సర్పంచుల పంచాయితీ వ్యవస్థను నాశనం చేస్తున్నారు. రాష్ట్రంలో 13వేల మందిలో ఎక్కువ వైసీపీ నేతలే సర్పంచులు అన్న సంగతికూడా ముఖ్యమంత్రికి తెలియదా..? ముఖ్యమంత్రి పంచాయితీ నిధులు ఎందుకు మళ్లించారని అడిగితే పంచాయితీ కరెంట్ బిల్లులు కట్టడానికి అని సాకులు చెప్పడం విచిత్రంగా ఉంది. రూ. 7650 కోట్ల పంచాయతీ నిధులు దారి మళ్లించి ఏమి చేశారో శ్వేతపత్రం ద్వారా విడుదల చేసే దమ్ము ధైర్యం ఉందా ? దీనిపై కేంద్రం వివరణ ఇవ్వాలని కోరితే ఇంతవరకు స్పందన లేదు. గత ప్రభుత్వం హయాంలో 2018 ఎన్నికలు జరపకుండా వదిలేసి కూర్చున్నారు. 2019 నుంచి గ్రామ పంచాయతీ కరంటు బిల్లులు ఎన్ని వున్నాయో వైసీపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. విద్యుత్ సంస్థలకు సైతం పంచాయతీ నిధులు చెల్లించడం లేదు . పంచాయితీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయిన వారికి ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు వాటిని ఇచ్చారా?

అమరావతిలో పేదల ఇళ్ల పేరుతో చేస్తున్నది పచ్చి మోసం !

రాజధాని అమరావతి లో పేదలకు 50 వేల ఇళ్ళు ఇవ్వాలని కొత్త తరహా మోసానికి తెరలేపారన్నది నిజం. ఓట్లు కోసం నేడు అమరావతి లో ఇల్లు డ్రామాలు ఆడుతున్నారు. అమరావతి రైతులకు ఎందుకు ప్లాట్లు ఇవ్వలేదు. అమరావతి రైతులు , వారి హక్కులను గుర్తించని మీ ప్రభుత్వం వారి భూములను ఉపయోగించుకోనే హక్కు ప్రభుత్వానికి ఎక్కడ నుంచి వస్తుంది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం లో ఇప్పట్టివరకు ఇళ్లను పూర్తి చేయలేని ముఖ్యమంత్రి పేదలకు 50వేల ఇళ్లను ఇస్తామంటే పేదలు నమ్ముతారా ?. అని ప్రశ్నించారు. బీజేపీ , యన్డీఏ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమ, అమరావతి రైతులకు న్యాయం చేస్తాం. ముఖ్యమంత్రి కి అమరావతిలో ఉండాలంటే 30 వేల ఎకరాలు అమరావతికి భూములిచ్చిన రైతుల హక్కులను నెరవేర్చి మాత్రమే అక్కడ పేదలకు ఇళ్ళు కట్టాలి. ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మ్యానిఫెస్టోలో 90శాతం మ్యానిఫెస్టోను పూర్తి చేశామని జర్నలిస్టుల ముందు చెప్పిన సంగతి మర్చిపోయారా ? అని ప్రశ్నించారు. చివరకు జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేని స్థితి నెలకొందని మండిపడ్డారు.

పురందేశ్వరి జోనల్ సమావేశాలకు మంచి స్పందన

ఏపీ బీజేపీ నూతన అధ్యక్షురాలు పురందేశ్వరి నేతృత్వంలో నిర్వహిస్తున్న జోనల్ సమావేశాలకు పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ప్రొద్దుటూరులో జరిగిన రాయలసీమ జోన్ సమావేశం విజయవంతం అయింది. రాయలసీమ డిక్లరేషన్ విషయంలో బీజేపీ విధానం స్పష్టంగా ఉంది. మంగళవారం కోస్తా జోన్ సమావేశంలో పురందేశ్వరి పాల్గొంటారు. కోస్తా జోన్ నుంచి పెద్ద ఎత్తున బీజేపీ నేతలు, కార్యకర్తలు ఈ సమావశంలో పాల్గొంటారు. ఎన్నికలకు ఎలా సిద్ధమవ్వాలి.. ప్రభుత్వంపై ఎలా పోరాడాలన్నది ఖరారు చేసుకుంటామని విష్ణువర్దన్ రెడ్డి ప్రకటించారు.