అమెరికాలోని నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో డాలస్ లో జరుగుతున్న తెలుగు మహాసభల్లో బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నారైలను ఉద్దేశించి ఆయన ఇచ్చిన సందేశానికి ప్రశంసలు దక్కాయి.
మహాత్ముడిలాగే ఎన్నారైలు ఆలోచిస్తున్నారు !
” మహాత్మాగాంధీ కూడా మీలాగే ఓ ఎన్నారై ” అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల అమెరికా పర్యటనలో చెప్పారు. స్వాతంత్ర్యం రాక ముందు.. వచ్చిన తర్వాత దేశ గతిని.. దేశ పారిశ్రామిక ప్రపంచాన్ని మలుపు తిప్పిన వారిలో అత్యధికులు ఎన్నారైలే. ఖండాంతరాలు దాటి వచ్చి దశాబ్దాలు గడిచిపోతున్నా మాతృభూమిపై మమకారాన్ని అంతకంతకూ పెంచుకునే మీరంతా అసలైన దేశభక్తులు. దేశం కోసం .. తెలుగు రాష్ట్రాల కోసం నిత్యం ఆలోచించే మంచి తెలుగు వ్యక్తుల నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అని పేర్కొన్నారు. ” నేను సంపన్నమైన, బలమైన, అజేయమైన భారత దేశాన్ని కలగంటున్నాను. గొప్ప దేశాలలో గౌరవప్రదమైన స్థానాన్ని భారతదేశం పొందుతుంది ” అని ఆధునిక భారతదేశ సృష్టికర్తగా తన పదవి కాలంలో పేరు తెచ్చుకున్న అటల్ బిహారీ వాజ్ పేయి నమ్మకంగా చెబుతూండేవారు. అలాంటి భారతదేశానికి నాడు పునాది పడింది. నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ ఆశయాలను, లక్ష్యాలను అక్షరాలా సాధించేందుకు ముందడుగు వేస్తున్నారని గుర్తు చేశారు.
దేశాభివృద్ధిని బయట నుంచి గమనిస్తున్న ఎన్నారైలు !
దేశంలో ఏం జరుగుతుందో.. బయట నుంచి చూసేవారికే బాగా కనిపిస్తుంది. ఎందుకంటే దేశంలో ఉన్న వారు. వివిధ రకాల భావజాలాలతో నిండి ఉంటారు. మంచిని కూడా సమర్థించలేకపోవచ్చు. కానీ ఎన్నారైలు అయిన మీరు దేశాన్ని.. మాతృభూమిని చూసే కోణం ఒక్కటే ఉంటుంది. మన దేశం ఎంత అభివృద్ధి సాధిస్తోంది. మనం ఎంత ముందుకు వెళ్తున్నాం.. మన దేశం ఎంత గొప్ప దేశంగా మారుతోంది అన్నదే మీ దృక్కోణం. కుల, మతాలు, ప్రాంతాలు, రాజకీయాలకు మీరు ప్రాధాన్యత ఇవ్వరు. దేశం ఎంత ముందడుగు వేస్తే అంత పొంగిపోతారు. దేశం ఎంత అభివృద్ధి చెందుతుందనేది దశాబ్దాలుగా బయట నుంచి భారత్‌ను పరిశీలిస్తున్న మీకే ఎక్కువ తెలుస్తుందని విష్ణువర్ధన్ రెడ్డి ఎన్నారైలతో వ్యాఖ్యానించారు.
అగ్రరాజ్యానికి ధీటుగా ప్రపంచంలో భారత్‌కు గౌరవం
ఇప్పటికే భారత్ ప్రపంచంలోని టాప్ ఫైవ్ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచింది. మరో నాలుగేళ్లలో టాప్ త్రీలోకి వస్తుందని అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు చెబతున్నాయి. ప్రపంచవ్యాప్తంగానికి అగ్రరాజ్యంతో సమానమైన గౌరవం లభిస్తోంది. గతంలో ఇలాంటివి మనం ఊహించలేదు. ఒకప్పుడు గుండె ఆపరేషన్ల కోసం మన దేశం నుంచి ఆమెరికాకు వచ్చేవాళ్లు.. ఇప్పుడు మన దేశానికే మెడికల్ టూరిజం ప్రారంభమయింది. ఇలా చెప్పుకూంటూ పోతే ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థలో ఓ సమర్థుడైన నాయకుడు వస్తే దేశాన్ని ఏ స్థాయికి తీసుకెళ్లవచ్చే ప్రధాని మోదీ పాలన ఓ మోడల్‌గా నిలుస్తోందన్నారు.
ఎన్నారైలకు దేశ సేవ కోసం ఎలాంటి సాయం చేయాల్సి వచ్చినా సంతోషిస్తానన్న విష్ణువర్ధన్ రెడ్డి
మీరంతా మాతృభూమి సేవకు ఎప్పుడు అవకాశం వచ్చినా వదులుకోరు. మీరంతా తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సేవా కార్యక్రమాలు, అక్కడి ప్రజలను అభివృద్ధి చేయడానికి మీ వంతు చేస్తున్న సాయం మాతృభూమికి తిరిగి చెల్లిస్తున్న రుణం. ఈ రుణం తీర్చుకోవడంలో మీరంతా చేస్తున్న కృషి స్ఫూర్తి దాయకమని ప్రశంసించారు. . అయితే దేశానికి ఎంత చేసినా ఇంకా ఎంతో కొంత చేయాలనిపిస్తుంది. ఎందుకంటే.. అమ్మ లాగే దేశం కూడా. దేశానికి ఎంత ఎక్కువ సేవ చేయాలంటే మీరు ఇక్కడ అంత ఎక్కువ సక్సెస్ కావాలని ఆకాంక్షించారు.
దేశాలు దాటి వచ్చినా మాతృభూమి, మాతృభాష స్ఫూర్తితో ఇక్కడ మీరంతా ఎంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని.. ఎలా విబేధాలు లేకుండా… ఒకరికొకరు సహకరించకుని.. దేశ ప్రతిష్టను ఇనుమడింప చేస్తారని ఆశిస్తున్నాను. దేశం కోసం మీరు చేయాలనుకుంటున్న సేవలో ఎలాంటి చిన్న సాయం అయినా చేయగలిగితే… దానికి నేను ఎల్లప్పుడూ రెడీగా ఉంటాను. నా శక్తివంచన లేకుండా దేశ సేవలో మీకు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.