ఏపీ బీజేపీ నేతలు ఫుల్ స్వింగ్ లోకి వచ్చారు. ఎన్నికల ప్రచారాన్ని ప్రణాళికాబద్దంగా నిర్వహిస్తూ..క్లైమాక్స్ లో పీక్స్ కు తీసుకెళ్తున్నారు. బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట్ల కూటమి పార్టీల సహకారంతో.. పూర్తి స్థాయిలో ప్రచారాన్ని ఇంటింటికి తీసుకెళ్లేలా ప్రత్యేక వ్యూహాలను అమలు చేస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో సీనియర్ నేతలు పర్యటిస్తున్నారు. బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డికి బీ జేపీ పోటీ చేస్తున్న చోట్ల సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు.
బద్వేలులో విష్ణువర్ధన్ రెడ్డి ప్రచారం
కడప జిల్లా బద్వేలు ఉపఎన్నికలు జరిగినప్పుడు బ ీజేపీ మంచి ఓట్ పర్సంటేజీని సాధించింది. ఈ సారి నేరుగా టీడీపీ, జనసేన మద్దతుతో అభ్యర్థిగా రోశన్న బరిలోకి దిగారు. ఆయన కోసం బీజేపీ ముఖ్య నేతలు ప్రచారంలోకి వస్తున్నారు. ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఓ రోజంతా అభ్యర్థి కోసం ప్రచారం చేశారు. భారీ ర్యాలీని నిర్వహించారు. సంప్రదాయకంగా వైసీపీకి కంచుకోటే అయినా ఈ సారి బీజేపీ బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
విష్ణువర్ధన్ రెడ్డి ప్రచారానికి మంచి స్పందన
బద్వేలు నియోజకవర్గం వెనుకబడిపోయి ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులతో ఇక్కడి ప్రజల అవసరాలు కొంత వరకే తీర్చవచ్చు. అదే కేంద్రం సాయం కూడా ఉంటే బ ద్వేలును నెంబర్ వన్ చేయవచ్చు. విష్ణువర్ధన్ రెడ్డి ప్రచారంలో ప్రజలకు అదే చెప్పారు. బిజెపి అభ్యర్థి గెలిస్తే కేంద్రం నుంచి నేరుగా నిధులు తీసుకొచ్చి రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. మూడో సారి ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టడం ఖాయమైనందున.. బీజేపీ అభ్యర్థులకు ఓటు వేయడం అంటే తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడమేనని ఆయన చెబుతున్నారు. చట్టసభల్లో బిజెపి పార్టీ ద్వార ప్రజల వాణిని వినిపించడానికి బీజేపీకి మద్దతివ్వాలని ఆయన బలంగా ప్రజల్ని కోరారు.
బీజేపీ సభ్యుల కోసం విస్తృత ప్రచారం
రాయలసీమలో ధర్మవరంతో పాటు బద్వేలు, తిరుపతి పార్లమెంట్‌లో బీజేపీ పోటీ చేస్తోంది. అన్ని చోట్లా ఈ సారి బలమైన విజయావకాశాలు ఉండటంతో సీనియర్లు విస్తృతంగా పర్యటిస్తున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి .. నేరుగా ప్రచారం చేయడంతో పాటు ఎలక్షనీరింగ్ వ్యూహాల్లోనూ పాలు పంచుకుంటున్నట్లుగా తెలుస్తోంది.