శ్రీవారి నిధులు హిందూ ధర్మ ప్రచారానికే – టీటీడీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన విష్ణువర్ధన్ రెడ్డి !

శ్రీవారి నిధులను తిరుపతి అభివృద్ధికి కేటాయించాలన్న నిర్ణయంపై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి వ్యతిరేకించారు. ఈ నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సీఎం జగన్ కు లేఖ రాశారు. దేశంలోనే కాదు ప్రపంచంలో ఏ హిందూ దేవాలయానికి వచ్చే ఆదాయాన్ని ఏ ప్రభుత్వాలూ , వ్యక్తులు ఆశించరు, ఇతర అవసరాలకు వినియోగించరని దేవునికి వచ్చే ఆదాయాన్ని ఆలయాల అభిృవద్ధికి, భక్తుల సౌకర్యాలకు, హిందూ ధర్మ ప్రచారానికి అర్చకులుకు మాత్రమే వినియోగించాలన్నారు.

శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీయవద్దు !

ప్రపంచంలోని హిందువులందరికీ శ్రీవారికి ఆరాధ్యదైవం. అందుకే అందరూ ఆయనకు తృణమో, పణమో సర్పించుకుంటారు. వారి ఉద్దేశం శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం.. హిందూ ధర్మ ప్రచారం చేయడం. ఆ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రానున్న రోజులలో మన రాష్ట్రంలో ఉన్న పేరెన్నిక గన్న ఆలయాలు సింహాచలం అప్పన్న దేవస్థానం , విజయవాడ కనక దుర్గమ్మ ఆలయం, శ్రీశైలం మల్లిఖార్జునుడి కోవెలల్లో దేవుడి సొమ్మును ఇలా ప్రత్యేకంగా నగరాల అభివృద్ధి కోసం కేటాయిస్తే పరిస్థి రాకూడదని, అలా చేయాలన్న ఆలోచన కూడా ఎప్పుడూ ఆ పాలక వర్గాలకు రాకూడదని గుర్తు చేస్తున్నాం.

తిరుపతి అభివృద్ధి ప్రభుత్వ బాధ్యత

శ్రీవారి భక్తులు ఇచ్చే విరాళాలు, కానుకలను వినియోగిస్తే సార్థకత లభించినట్లు అవుతుంది. తిరుపతి అభివృద్ధి ప్రభుత్వం బాధ్యత. తిరుమలకు వచ్చే భక్తుల వల్ల తిరుపతి కూడా అభివృద్ధి చెందుతోంది. ఎంతో ఆదాయం వస్తోంది. శ్రీవారి భక్తులవల్ల తిరుపతిలో ఎంతో సంపద వృద్ధి చెందుతోంది. అందుకు ప్రతిగా… ప్రభుత్వం తరుపున శ్రీవారికి ఎంతో కొంత ఉడతా భక్తిగా మరింత మేలు చేయాల్సింది పోయి… శ్రీవారి నిధుల్నే ఒక్క శాతం తీసుకుని తిరుపతిని అభివృద్ధి చేయాలనుకుకోవడం సమంజసం కాదన్నారు. నేడు తిరుమల తిరుపతి దేవస్థానాల ఆదాయంలో ఒక్క శాతం నిధులు తిరుపతిలో భక్తులు సౌకర్యాలు వారు అభివృద్ధికి కేటాయించాలని పాలకమండలిలో కొందరు చేసిన సూచనలు , అభిప్రాయాలతో పర్యవసానాలు ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నారు. ఆమోదం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుమతి కోసం ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనల్ని తిరస్కరించాలని విష్ణువర్ధన్ రెడ్డి కోరాు.

స్మార్ట్ సిటీ కింద తిరుపతికికేద్రం నిధులు

అభివృద్ధి పనులకు సంబంధించిన విషయంలో అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం అదనపు నిధులు కేటాయించాలి. తిరుపతిని ఇప్పటికీ స్మార్ట్ సిటీల జాబితాలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చింది, అలాగే రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి నగరపాలక సంస్థకు ఆర్థిక సహకారం అందించాలి . లక్షల మంది భక్తులు తిరుపతికి రావడం వాస్తవమే ఈ ప్రాంతం శుభ్రంగా ఉండాలని కూడా మేము కోరుకుంటున్నామన్నారు.
ఇది ఓ రకంగా ప్రభుత్వం బాగ్యతలనుండి తప్పించుకోవడమే. అందుకే్ తిరుపతిని అభివృద్ధి చేయడానికి తిరుమల పాలకవర్గం ఆలోచన చేసినట్లు ప్రతి సంవత్సరం 100 కోట్లు తిరుపతి కార్పొరేషన్ కు అదనంగా బడ్జెట్ ఇవ్వాలని కోరుతున్నానన్నారు.

నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి !

భక్తుల కానుకల వినియోగం విషయంలో దయచేసి టీటీడీ నిర్ణయాన్ మరో సారి సమీక్ష చేయాలి. రాష్టప్రభుత్వం సైతం టీటీడీ మరో సారి ఆలోచన చేయమని ఆదేశంచిచాలని అంతవరకు ఆ తీర్మానం ఆమోదించవద్దని కోరుతున్నాము. టీటీడీ తీసుకున్ ఈ ననిర్ణయంలో మరో సారి ధార్మిక సంస్థలు ధర్మాచార్యులు పీఠాధిపతులు భక్తుల అభిప్రాయాన్ని సైతం తీసుకొని ఇలాంటి నిర్ణయాల విషయంలో నేడు గాని భవిష్యత్తులో గాని ఆలోచన చేస్తే బాగుంటుందని సూచిస్తున్నాం. టీటీడీ పాలక మండలి తమ నిర్ణయాన్ని భక్తులు మనోభావాలు , అభిప్రాయాలు పరుగనలోనికి తీసుకోని పునర్ సమీక్ష చేసుకొని ఏ నిర్ణయాన్ని తక్షణ ఉపసంహరించుకోవాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. !