ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త టెర్మినల్ నిర్మాణం శరవేగంగాసాగుతున్నాయి. పనులు పరుగులు పడుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ ఎయిర్ పోర్టుకు అంతర్జాతీయ హోదా లభించడంతో కొత్త టెర్మినల్ నిర్మించాలని నిర్ణయించారు. ఎయిర్‌పోర్టులో అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున 700 ఎకరాలను సమీకరించి ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండి యా (ఏఏఐ)కు అప్పగించారు. ఆ భూముల్లోనే రన్‌వే విస్తరణ, ఆఫ్రాన్ల నిర్మాణం, అదనపు పార్కింగ్ బేలు, అగ్నిమాపక స్టేషన్లు, సోలార్ ప్లాంట్, రోడ్ల విస్తరణ, కార్ల స్టాండ్, ఇంటీరియం టెర్మినల్ బిల్డింగ్, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణాలు జరుగుతున్నాయి.
రూ.611 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ పనులు
రూ.288 కోట్ల వ్యయంతో నాడు ఇంటీరియం టెర్మినల్ బిల్డింగ్ పనులు జరిగాయి. ఏడాది సమయంలో పూర్తి చేయటం జరిగింది. రూ.611 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ పనులు చేపట్టారు. విజయవాడలో ఇది పూర్తయితే.. రాష్ట్రంలోనే అత్యంత ప్రధానమైన విమానాశ్రయంగా మారుతుంది. గ్లాస్, స్టీల్ స్ట్రక్చర్‌లో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో శాశ్వత ప్రాతిపదికన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ పనులు చేపడుతున్నారు. ఈ బిల్డింగ్‌కు అనేక ప్రత్యేకతలున్నాయి. ప్రయాణికుల కోసం ఆధునిక వసతులు ఏర్పాటు చేస్తారు. ఆధునిక బ్యాగేజీ హ్యాండ్లింగ్ సిస్టమ్, ఎరైవల్ బ్యాగేజీ క్లెయిమ్ క్లారోసోల్స్, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ డి స్ప్లే సిస్టమ్, కామన్ యూజ్ టెర్మినల్ ఎక్విప్మెంట్, చెక్ ఇన్ కౌంటర్లు, ఇమ్మిగ్రేషన్, కస్టమ్ కౌంటర్స్, గెస్ట్‌హౌస్ వంటివి ఏర్పాటు చేస్తారు. దీనికి అనుబంధంగా కొత్త ఆప్రాన్ ఉంటుంది. మూడు కోడ్ ఈ విమానాలు, ఆర్ కోడ్సీ విమానాలు పార్కింగ్ చేసుకునేలా ఆఫ్రాన్ ఉంటుంది.
విజయవాడకు తలమానికంగా ఎయిర్ పోర్టు
విజయవాడకు ఎయిర్ ట్రాఫిక్ పెరిగింది. కనెక్టివిటీ దేశంలోని దాదాపు అన్ని నగరాల్నించి ఏర్పడింది. పలు కీలకమైన అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. విజయవాడ విమానాశ్రయంలో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణం కోసం నేషనల్ ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 470 కోట్లు మంజూరు చేసింది. ఏకంగా 3 లక్షల 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో టెర్మినల్ భవన నిర్మాణం జరుగుతోంది. ఈ కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణం పూర్తయితే…రాష్ట్రానికే తలమానికంగా నిలువనుంది. ఈ కొత్త భవనం నిర్మాణంతో ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.ఈ త్రీడీ డిజైన్ ను విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఏపీలో రైల్వేస్టేషన్లు, ఎయిర్ పోర్టుల నిర్మాణానికి వేల కోట్లు వెచ్చిస్తన్న కేంద్రం
ఏపీలో కేంద్ర ప్రభుత్వం.. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోంది. వరల్డ్ క్లాస్ నిర్మాణాలు చేపడుతోంది. తిరుపతి రైల్వే స్టేషన్ ను అత్భుతంగా నిర్మిస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఉండాల్సిన కనీస సహకారం లేకపోవడం వల్లనే చాలా పనులు ఆలస్యం అవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.