ఏపీ ప్రభుత్వం కరెంట్ చార్జీలను అర్థం కాని రీతిలో బాదేస్తూ పెద్ద ఎత్తున ప్రజలను దోపిడీ చేస్తోంది. ఈ అంశంపై కొంత కాలంగా బీజేపీ పోరాడుతోంది. వివిధ రకాల సర్ చార్జీల పేరుతో చేస్తున్న దోపిడీని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి బయట పెట్టారు. ఓ కరెంట్ బిల్లును సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆయన… అందులో ఉన్న రకరకాలచార్జీలను విశ్లేషించారు. ఆ బిల్లు చూసిన ఎవరికైనా ప్రభుత్వ దోపిడీని చూసి మతి పోగొట్టుకోవడం ఖాయం.
63 యూనిట్లు వాడుకున్నందుకు బిల్లు రూ. 807
వందలోపు యూనిట్లు వాడుకున్న ఎవరికైనా వచ్చే బిల్లు నూట యాభై మించదు. కానీ ఏపీలో మాత్రం రూ. 800 కన్నా ఎక్కువ. అసలు కరెంట్ వాడుకున్నదానికి రూ . 369 అయితే.. దానికి ~సర్ చార్జ్, ఫిక్స్డ్ చార్జెస్, కస్టమర్ చార్జెన్స్, ఒక ఎఫ్‌పీపీసీఏ, రెండో ఎఫ్‌పీపీసీఏ, ఎలక్ట్రిసిటీ డ్యూటీ,, అడ్జస్ట్ మెంట్లు ఇలా అనేక రకాల వడ్డింపుల తర్వాత మొత్తం బిల్లు రూ. 807 అయింది. అంటే.. అసలు చార్జీల కన్నా.. ఈకొసరు చార్జీలే ఎక్కువన్నమాట . ఓట్లేసినప్రజల్ని ఇలా ఎలా దోపీడీ చేస్తారని విష్ణువర్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
విద్యుత్ రంగంలో భారీ అవినీతి
ఏపీ విద్యుత్ రంగంలో ఇటీవలి కాలంలో భారీ అవినీతి చోటు చేసుకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యుత్ ఉత్పత్తి చేయకుండా ఆపేసి.. బహిరంగ మార్కెట్ నుంచి యూనిట్ కు రూ. పదిహేను నుంచి ఇరవై వరకూ కొనుగోలు చేస్తున్నారు దానిపై పడే అదనపు భారాన్ని ట్రూప్ అప్, ఎఫ్‌పీపీసీఏల పేరుతో ప్రజల నుంచే పిండుకుంటున్నారు. అదే సమయంలో అవసరం లేకపోయినా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనేక కంపెనీ నుంచి వేల కోట్ల విలువైన ట్రాన్స్ ఫార్మర్లు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ అక్రమాలతో వేల కోట్లు వృధా చేసి ప్రజల్ని పిండేసుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఇంత చేస్తూ అప్రకటిత విద్యుత్ కోతలతో జనం సతమతం
ప్రజల్ని ఇలా కరెంట్ చార్జీల పేరుతో బాదేస్తున్నా… విద్యుత్ నిరంతరాయంగా ఇవ్వలేకపోతున్నారు. గట్టిగా ఎండలు కాశాయంటే.. ఎక్కడ చూసినా విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు. ఫలితంగా ప్రజలు అసహనానికి గురవుతున్నారు. ఈ ప్రభుత్వ నిర్వాకం.. విద్యుత్ రంగంలో దారుణంగా ఉందన్న అబిప్రాయానికి వస్తున్నారు. ప్రభుత్వ విద్యుత్ విధానాల్లో చేతకాని తనాన్ని ప్రజల ముందు పెడతామని ఏపీ బీజేపీ నేతలు ఇప్పటికే ప్రకటించారు.