తెలుగు రాష్ట్రాల్లో మత మార్పిళ్ల మాఫియా చెలరేగిపోతోంది . మొబైల్ మతమార్పిడి కేంద్రాలుగా కార్లను మార్చేసుకుని ఇష్టం వచ్చినట్లుగా గ్రామాల్లో తిరుగుతూ ఏమీ తెలియని అమాయకులు మనసుల్లో విషం నింపుతున్నారు. మతం మార్చేస్తున్నారు . చివరికి వారి తాళి బొట్లు కూడా తెంచేస్తున్నారు. ఇలాంటి ఓ పాస్టర్ వ్యవహారాన్ని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా బయటపెట్టారు. ఈ ట్వీట్ వైరల్ అయింది. మత మార్పిళ్లకు పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి
విచ్చలవిడి మత మార్పిళ్లు
“గాడ్స్ వే మిషన్” సంస్థ పేరుతో బ్రదర్ మల్లిఖార్జునరావు అనే వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లో కొన్ని గ్రామాలను టార్గెట్ చేసుకుని మత మార్పిళ్లు చేస్తున్నాడు. కారులో వెళ్తూ తానే స్వయంగా వీడియో తీసుకునేలా సెట్ చేసుకుని రోడ్డు మీద పోయేవారితో మాట్లాడుతున్నారు . మాటల్లో పెట్టి మత మార్పిడి చేసుకోమని చెబుతున్నారు. రోడ్ల మీదనే చిన్న చిన్న కచేరిలు పెట్టి మత మార్పిడి చేసుకోకపోతే నాశనమైపోతారని ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు. ఈ వీడియోలను ఆయనే యూట్యూబ్ లో అప్ లోడ్ చేసుకోవడంతో విషయం సంచలనంగా మారింది.
వీడియోను వెలుగులోకి తెచ్చి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన విష్ణువర్ధన్ రెడ్డి
బ్రదర్ మల్లిఖార్డున రావు వ్యవహరం సంచలనం అయింది. విష్ణువర్ధన్ రెడ్డి ట్విట్టర్ లో వీడియోను పోస్ట్ చేసి అధికార యంత్రాంగాన్ని ప్రశ్నించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వేచ్చా మత మార్పిడుల చట్టం ఏమైనా తెచ్చారా? అని ప్రశ్నించారు. “గాడ్స్ వే మిషన్” సంస్థ పేరుతో బ్రదర్ మల్లిఖార్జునరావు (అలియాస్ గాడ్స్ ) మత మార్పిళ్లుపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. స్కూల్‌కు వెళ్లే పిల్లల్ని సైతం వదలకుండా మత ప్రచారం చేయడం సిగ్గుచేటు. TS08FK4477 నెంబర్ వాహనంలో ఊళ్ల మీద పడి తాళిబొట్లు కూడా తెంచేస్తున్నాడని మండిపడ్డారు.
పోలీసులు ఎందుకు పట్టించుకవోడం లేదన్న విష్ణు
గ్రామాల్లో చేస్తున్న మత ప్రచారాన్ని పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని విష్ణువర్ధన్ రెడ్డిప్రశ్నించారు. ఓటు బ్యాంక్ రాజకీయాలకోసం బాప్టిజం ఘాట్ల నిర్మాణాలకు సహకరించే వారికి ఇలాంటి పాస్టర్ల విచ్చలవిడి మత మార్పిళ్లు ప్రమాదమనిపించడం లేదా ? అని మండిపడ్డారు. మత స్వేచ్చ ముసుగులో హిందువుల విశ్వాసాలను దెబ్బతీస్తున్న ఇలాంటి పాస్టర్లపై తక్షణం రెండ తెలుగు రాష్ట్రాల డీజీపీలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే రెండు తెలుగు రాష్ట్రాలు మత మార్పిళ్ల నిరోధక చట్టం తేవాలని డిమాండ్ చేశారు.