టాలీవుడ్ టాప్ 5 దర్శకుల లిస్ట్ తీస్తే అందులో బోయపాటి శ్రీను కచ్చితంగా ఉంటాడు. హీరో ఎవ్వరైనా వారికి పక్కా మాస్ ఇమేజ్ కట్టబెట్టడంలో బోయపాటి తర్వాతే ఎవ్వరైనా బాలయ్యతో మూడు సినిమాలు తీస్తే మూడూ బ్లాక్ బస్టర్ కొట్టిన ఘనత బోయపాటిదే. అలాంటి బోయపాటి ప్రస్తుతం ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో సినిమా చేస్తున్నాడు. అఖండ తర్వాత బోయపాటి చేస్తున్న సినిమా ఇదే. దీంతో… బాలయ్యతో కాకుండా మరో హీరోతో హిట్ ఇవ్వలేడనే చెడ్డపేరుని ఈ సినిమాతో పోగొట్టుకోవాలని అనుకుంటున్నాడు బోయపాటి. అందుకే రామ్ సినిమాను ఎక్కడా కాంప్రమైంజ్ కాకుండా పిక్చరైజ్ చేస్తున్నారు. ఎంతలా అంటే… ఈ సినిమాతో 1000 మంది ఫైటర్స్ తో రామ్ పై ఫైట్ సీక్వెన్స్ తీస్తున్నాడు బోయపాటి. ఇది సినిమాకే హైలెట్ అవుతుంది అని చెప్తున్నాడు.
వినయ విధేయ రామ రిపీట్ అవుతుందా.?
ఒక స్టార్ హీరో చేతిలో పడేసరికి అతడ్ని ఎలాగైనా సరే డిఫరెంట్ చూపించాలనే తాపత్రయంతో అనుకున్నదానికంటే ఎక్కువ చూపిస్తాడు బోయపాటి. ఒక్కోసారి అది రివర్స్ అవుతుంది. వినయ విధేయ రామ సినిమాకు ఇదే జరిగింది. అసలు ఆడియన్స్ ఊహించని రేంజ్ లో ఫైట్లు, ఛేజ్ లు, వందల మంది ఫైటర్స్ తో సినిమా తీసే సరికి అది కాస్తా కామెడీ అయ్యి ఫ్లాప్ అయ్యింది. దీంతో అఖండ సినిమాకు కాస్త జాగ్రత్త పడ్డాడు. హిట్ కొట్టాడు. అఖండతో హిట్ వచ్చేసరికి మళ్లీ ఇప్పుడు రామ్ తో మళ్లీ మొదలుపెట్టాడు. భారీ యాక్షన్ సీక్వెన్స్ లు, ఫైట్లు తీస్తూ సినిమాపై బజ్ పెంచేస్తున్నాడు. సినిమా హిట్ అయితే ఓకే. లేదంటే.. ఇది కూడా వినయ విధేయ రామలా అయిపోతుందని అభిమానులు భయపడిపోతున్నారు.
బాలీవుడ్ మార్కెట్ కోసమే
అయితే రామ్-బోయపాటి చెప్పే వెర్షన్ మరోలా ఉంది. రామ్ సినిమాలకు బాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. ఇస్మార్ట్ శంకర్ ని అక్కడి ప్రజలు బాగా ఆదరించారు. ఇక యూట్యూబ్ లో అయితే ఇస్మార్ట్ శంకర్ కు మిలియన్ వ్యూస్ ఉన్నాయి. అలాగే బోయపాటి సినిమాలకు కూడా అంతే. సరైనోడు, జయ జానకి నాయక సినిమాలు యూట్యూబ్ లో బంపర్ హిట్స్. దీంతో.. తమకున్న ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని, బాలీవుడ్ లో కూడా వర్కవుట్ అయ్యేలా ఈ సినిమాను రూపొందిస్తున్నారని ఇండస్ట్రీ టాక్. ఏది ఎలా చేసినా, ఎంతమందిని పెట్టి ఫైట్లు సీన్లు తీసినా అవన్నీ ఆడియన్స్ కు నచ్చినప్పుడే క్లిక్ అవుతుంది. లేదంటే.. వినయ విధేయ రామ సినిమాలో యాక్షన్ సీన్స్ లా కామెడీ అవుతుంది. మరి ఈ విషయం బోయపాటికి వరకు చేరిందో లేదో.