కేసీఆర్ ను ఓడించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ… బలమైన అభ్యర్థుల్ని ఆయనపై నిలబెట్టాలనుకుంటోంది. భారత రాష్ట్ర సమితి చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ సారి కామారెడ్డి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా అభ్యర్థుల జాబితాలో తన పేరును కూడా ప్రకటించారు. ఆయన కామారెడ్డి నుంచి ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారన్న విషయంపై అనేక రకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. అయితే కేసీఆర్ ను రెండు చోట్ల ఓడించాలనుకుంటున్న బీజేపీ .. బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలని అనుకుంటోంది.
తెరపైకి విజయశాంతి పేరు
బీజేపీ హైకమాండ్ విజయశాంతి పేరు పరిశీలిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. విజయశాంతి అయితే కేసీఆర్ కు గట్టి పోటీ ఇస్తారని భావిస్తున్నారు. బీజేపీలో, సోషల్ మీడియాలో ఈ అంశంపై విస్తృత చర్చ జరగుతూండటంతో.. విజయశాంతి కూడా స్పందించారు. కామారెడ్డి అసెంబ్లీ పై నా పోటీ విషయం మా పార్టీ నిర్ణయిస్తుందన్నారు. బీజేపీ కార్యకర్తలం ఎవరైనా పార్టీ ఆదేశాలను పాటించడం మాత్రమే మా విధానమని సోషల్ మీడియాలో తెలిపారు. ఏది ఏమైనా కామారెడ్డి, గజ్వేల్ రెండు నియోజకవర్గాలలో బీజేపీ గెలుపు, తెలంగాణ భవిష్యత్తుకు తప్పనిసరి అవసరం అన్నారు.
గజ్వేల్ తో పాటు కామారెడ్డిలోనూ కేసీఆర్ పోటీ
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ మరోసారి గజ్వేల్ నియోజకవర్గంతో పాటు కామారెడ్డి నియోజకవర్గంలోనూ పోటీచేయనున్నారు. 1983లో మొదటిసారిగా సిద్దిపేట నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. అప్పట్నుంచి ఓడిపోలేదు. 2014లోను గజ్వేల్ నుంచి పోటీ చేసి సీఎం అయ్యారు. 2018లోను అక్కడి నుంచే పోటీ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నియోజకవర్గంలోను కేసీఆర్ పోటిచేయనున్నారు. కామారెడ్డిలో బీఆర్ఎస్ తపున గంప గోవర్దన్ వరుసగా విజయం సాధిస్తున్నారు. ఆ పార్టీకి కంచుకోటగా ఉంది. ఈ సారి కేసీఆర్ పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో.. ఆయనపై బలమైన అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకోవాలని బీజేపీ పట్టుదలగా ఉంది.
విజయశాంతికి అన్యాయం చేశారని విమర్శలు
పార్టీ పెట్టి .. తెలంగాణ కోసం పోరాడిన విజయశాంతి త నపార్టీని బీఆర్ఎస్ లో విలీనం చేశారు . అచ్చంగా ఆలె నరేంద్రలాగే… విజయశాంతి కూడా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి.కేసీఆర్ … విజయశాంతికి అన్యాయం చేసినందున… ప్రజల సానుభూతితో పాటు..కేసీఆర్ అన్యాయాలను ప్రజల ముందు పెట్టవచ్చని భావిస్తున్నారు. తెలంగాణ సమాజంలో రాములమ్మకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.