విజయసాయిరెడ్డి వర్సెస్ వైవీ సుబ్బారెడ్డి – వైసీపీలో మరో ఫైట్ !

వైసీపీలో అధికారం అనుభవిస్తున్న వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరాటం రచ్చకు దారి తీస్తోంది. ఇప్పటి వరకూ వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య జరిగిన పోరాటం కాస్తా .. ఓ నాయకుడు పార్టీలో ఉంటాడా లేదా అన్న స్థితికి చేరిపోయింది. ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి మధ్య ఫైట్ జరుగుతోంది. విజయసాయిరెడ్డి వర్సెస్ సుబ్బారెడ్డి నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లుగా పోరాడుతున్నారు. విశాఖలో పార్టీ నేతలకు విజయసాయిరెడ్డి పదవులు ఇస్తే..సుబ్బారెడ్డి వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారు.

విజయసాయిరెడ్డి మనుషుల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సుబ్బారెడ్డి

విశాఖలో వైసీపీ పీవీ సురేష్ అనే కార్పొరేటర్ ను పార్టీ నుంచి బహిష్కరించింది. అలాగే దొడ్డి మురళి అనే మరో డివిజన్ అధ్యక్షుడికీ గుడ్ బై చెప్పింది. దీంతోవిశాఖ వైసీపీలో కలకలం ప్రారంభమయింది.ఎందకంటే విర్దదరూ విజయసాయిరెడ్డికి అనుచరులు. గతంలో విజయసాయిరెడ్డికి విగ్రహం పెట్టి మరీ పాలాభిషేకం చేసిన ఘనులు వీరు. వీరు సుబ్బారెడ్డి వచ్చినా విజయసాయిరెడ్డి మాటే వింటున్నారు. మూడు రోజుల కిందట విజయసాయిరెడ్డి అనుచరుల్ని పార్టీ పదవుల నుంచి తొలగించారు సుబ్బారెడ్డి. వెంటనే విజయసాయిరెడ్డి పార్టీ అనుబంధ సంఘాల ఇంచార్జ్ హోదాలో మళ్లీ వారిని పార్టీ పదవుల్లో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తర్వాత .. సుబ్బారెడ్డి అసలు వారిని పార్టీ నుంచే సస్పెండ్ చేశారు. విశాఖలో ఓ కార్పొరేటర్ ను.. మరో డివిజన్ ఇంచార్జ్ ను పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కారణం చెప్పారు.

విశాఖలో జోక్యం చేసుకుంటున్న విజయసాయిరెడ్డి !

విశాఖకు విజయసాయిరెడ్డి చాలా కాలం ఇంచార్జ్ గా ఉన్నారు. ఆయనను ఉత్తరాంధ్ర సీఎం అని చెప్పుకున్నారు. నడిచినంత కాలం నడిచింది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. విజయసాయిరెడ్డికి సీఎం జగన్ ప్రాధాన్యం తగ్గించారు. కానీ ఆయన మాత్రం విశాఖను వదిలి పెట్టేది లేదంటున్నారు. ప్రస్తుతం విశాఖ వైసీపీ ఇంచార్జ్ గా వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. ఆయన తాను విజయసాయిరెడ్డి ను పంపేసి సీట్లోకి రాగానే..తన మనుషులకు ప్రాధాన్యం ఇస్తూ పోయారు. విజయసాయిరెడ్డి నియమించిన వారిని పార్టీ పదవుల నుంచి తొలగించారు. తాను నియమించారు. విశాఖపై పట్టు కోల్పోకూడదనుకుంటున్న విజయసాయిరెడ్డి వెంటనే పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షుని హోదాలో.. మళ్లీ విశాఖలో తన అనుచరుల్ని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చేశారు. దీంతో వైవీ సుబ్బారెడ్డి కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇద్దరూ పోటాపోటీగా చర్యలు తీసుకుంటూడటంతో వివాదం ముదిరిపోతోంది.

ఎవరికీ సర్దిచెప్పలేని స్థితిలో వైసీపీ హైకమాండ్ !

ఉత్తరాంధ్ర ఇంచార్జ్ గా ఉన్న తన ప్రాధాన్యాన్ని తగ్గించేలా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డి వ్యవహారాన్ని జగన్ దగ్గరే తేలుస్తానని సుబ్బారెడ్డి అంటున్నారు. వైవీ ధాటికి ఇప్పటికే బాలినేని ఇంటికెళ్లిపోయారు. ఇప్పుడు విజయసాయిరెడ్డికి కూడా అదే పరిస్థితి వస్తుందని వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. విజయసాయిరెడ్డి ఇటీవల సైలెంట్ గా ఉంటున్నారు. ఢిల్లీలోనే ఎక్కువ ఉంటుంది. ఇటీవల బాలినేని రాజీనామా చేసిన కోఆర్డినేటర్ పదవిని విజయసాయికి ఇచ్చారన్న ప్రచారంఉంది. కానీ ఇలా బాధ్యతలిచ్చారని ఆయన ట్విట్టర్‌లో కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పలేదు. దీంతో ఏదో జరుగుతోందని అందరికీ అర్థమైంది. ముందు ముందు ఈ ఇద్దరు పెద్దారెడ్ల పేరు వైసీపీలో ముదిరే అవకాశం ఉంది.