మళ్లీ వైసీపీలో విజయసాయిరెడ్డి హవా – కీలక బాధ్యతలిచ్చిన జగన్!

కొంత కాలం నుంచి సైలెంట్ గా ఉంటున్న విజయసాయిరెడ్డి వైసీపీలో మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఈ సారి ఆయనకు ఉత్తారంధ్ర కాకుండా..కోస్తా జిల్లాల బాధ్యతలిచ్చాు. ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు, బాపట్ల, నరసరావుపేట జిల్లాలకి రీజనల్ కోఆర్డినేటర్‌గా విజయసాయిరెడ్డిని జగన్ నియమించారు. ఆయన పనిలోకి దిగిపోయారు. అక్కడ నేతల మధ్య ఉన్న విబేధాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు.

టాస్క్ మాస్టర్ విజయసాయిరెడ్డి

గత ఎన్నికలకు ముందు విజయసాయిరెడ్డి టాస్క్ మాస్టర్ గా పని చేశారు. ఓ రకంగా ఆయన దళపతిగా పని చేశారు. తర్వాత దూరం అయ్యారు. ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు, బాపట్ల, నరసరావుపేట జిల్లాలకి రీజనల్ కోఆర్డినేటర్‌గా విజయసాయిరెడ్డికి జగన్ బాధ్యతలిచ్చినట్లుగా చెబుతున్నారు. నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ పదవికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్ ఇటీవలడి రాజీనామా చేశారు. ప్రకాశం జిల్లా బాధ్యతలు బాలినేనికి అప్పగించకుండా విజయసాయిరెడ్డిని వైసీపీ అధిష్టానం తెరపైకి తెచ్చింది. వైఎస్ జగన్‌ నమ్మే అతి కొద్ది మందిలో సాయిరెడ్డి మొదటి వ్యక్తని వైసీపీ శ్రేణులు చెప్పుకుంటూ ఉంటాయి.

ఇటీవలి వరకూ పార్టీలో ఎలాంటి బాధ్యతలు లేని విజయసాయిరెడ్డి

రాజకీయంగా ఆయనకు అపార అనుభవమే ఉందని.. వీటన్నింటికీ మించి ఎలాంటి నేతల మధ్య విబేధాలున్నా ఒకట్రెండు సమావేశాలతోనే కలిపేసే సత్తా కలిగి ఉన్న నేత అని అభిమానులు, అనుచరులు చెప్పుకుంటూ ఉంటారు. అందుకే ఈయనైతేనే ఈ మూడు జిల్లాల ఎమ్మెల్యేలు, ద్వితియ శ్రేణి నేతలను సమన్వయం చేసుకోగలరని సీఎం విశ్వసిస్తున్నారట. ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి చేతికి జగన్ ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు, బాపట్ల, నరసరావుపేట జిల్లాల పగ్గాలిచ్చేశారు. నిజానికి గత ఫిబ్రవరిలో అనుబంధ విభాగాల రాష్ట్ర సమన్వయ కర్తగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని నియమించారు. ఇంచార్జ్‌ గా విజయసాయిరెడ్డి ఉన్నారు. ఆయన కింద కో ఇన్ఛార్జిగా చెవిరెడ్డి ఉన్నారు.

విజయసాయి అవసరాన్ని జగన్ గుర్తించారా ?

ఇటీవ‌ల విజ‌య‌సాయిరెడ్డిని సీఎం జ‌గ‌న్ పిలిపించుకుని గ‌తంలో మాదిరిగా పార్టీ బాధ్య‌త‌లు తీసుకోవాల‌ని సూచించిన‌ట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నిక‌లు ముంచుకొస్తున్న త‌రుణంలో విజ‌య‌సాయిరెడ్డి అవ‌స‌రం పార్టీకి ఎంతో అవ‌స‌రం ఉంద‌ని జ‌గ‌న్ గుర్తించారని అంటున్నారు. ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని పార్టీ ప‌ద‌వులు ఎవ‌రెవ‌రికి ఇవ్వాల‌నే విష‌య‌మై విజ‌య‌సాయిరెడ్డి క‌స‌ర‌త్తు ప్రారంభించారని అంటన్నారు. మొత్తంగా విజయసాయిరెడ్డి యాక్టివ్ కావడం వైసీపీలో కొంత మంది నేతలకు మళ్లీ ఉత్సాహం తెచ్చి పెట్టింది.