వంగవీటి రాధాకు పోటీ చేయడానికి సరైన స్థానం చూపించడం టీడీపీకి క్లిష్టంగా మారింది. పాదయాత్ర చేస్తున్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను కూడా ఫైనల్ చేస్తున్న లోకేష్ కు.. విజయవాడ దాటి నూజివీడు వెళ్లినా రాధాకృష్ణకు టిక్కెట్ ఖరారు చేయలేకపోయారు. ఈ అంశంపై పాదయాత్ర విరామ సమయంలో లోకేశ్ కసరత్తు చేశారు. వంగవీటి రాధాతో ఈ అంశంపై దాదాపుగా అరంగట సేపు చర్చలు జరిపారు. యువగళం పాదయాత్ర విజయవాడకు వచ్చినప్పటి నుండి రాధా కూడా పాదయాత్రలో పాల్గొంటున్నారు. వంగవటి రాధా లాంటి నేతను ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయించాలని..కానీ ఏ స్థానం నుంచి అన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. విజయవాడ సెంట్రల్ కోరుకుంటున్న వంకవీటి వంగవీటి రాధా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోనే రాజకీయాలు చేస్తూంటారు. కానీ అక్కడ టీడీపీ తరపున బొండా ఉమ అభ్యర్థిగా ఉన్నారు. ఇతర రెండు నియోజకవర్గాల్లోనూ బలమైన అభ్యర్థులు ఉన్నారు. వంగవీటి రాధాను మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలన్న ఆలోచనలో టీడీపీ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కానీ వంగవీటి ఆలోచనలపై మాత్రం స్పష్టత లేదు. ఆయనకు విజయవాడ నగరం దాటి వెళ్లే ఆలోచన లేదని అనుచరులు చెబుతున్నారు. కానీ వంగవీటి రంగా వారసుడిగా ఆయన కృష్ణా జిల్లాలో ఎక్కడ పోటీ చేసిన విజయం సాధిస్తారని ఆయన అనుచరులు నమ్మకంతో ఉన్నారు. మచిలీపట్నం ఇస్తామంటున్న టీడీపీ వంగవీటి రాధా కృష్ణా 2004 విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో మల్లాది విష్ణు చేతిలో అతి తక్కువ తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు రాధా. 2014 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి రాధా పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల సమయంలో వంగవీటి రాధా టీడీపీ కండువా కప్పుకున్నారు. ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈ సారి పోటీ చేయాలని పట్టుదలతో ఉన్నారు. మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీ చేయించాలని అనుకుంటున్నారు. కానీ అందుకు వగవీటి సుముఖంగా లేరు. క్లారిటీ కోరుతున్న వంగవీటి ఎన్నికలు దగ్గరపడుతూండటంతో ఈ అంశంపై పూర్తి స్థాయిలో టీడీపీ, వంగవీటి రాధా కసరత్తు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. వంగవీటి అభిప్రాయం ప్రకారమే.. సీటు కేటాయించాడనికి టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఈ విషయంలో.. ఏమైనా ఇబ్బందులు ఎదురైతే పరిష్కరిస్తామని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. మరో వైపు వంగవీటి రాధాకృష్ణ పెళ్లి వచ్చే నెలలో జరగనుంది. చాలో లో ప్రోఫైల్లో అత్యంత సన్నిహితుల మధ్య ఈ వివాహ కార్యక్రమం జరగనుంది. ఈ వివాహానికి లోకేష్ ను వంగవీటి రాధాకృష్ణ ఆహ్వానించారని చెబుతున్నారు.
Related Posts
చంద్రబాబు ప్రభుత్వంలో బీజేపీ, జనసేన ఉంటాయా ?
ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా ఉన్నాయి. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు. మరి కూటమిగా పోటీ చేసిన జనసేన, బీజేపీ ప్రభుత్వంలో చేరుతాయా లేకపోతే.. బయట నుంచి…
బీజేపీ కూటమిలోకి వచ్చినప్పుడే విజయం – ఏపీ ఫలితాలు చెప్పింది ఇదే
చంద్రబాబుకు ఒంటరిగా గెలిచిన రికార్డే లేదు.. ఈ సారి ఆయన ఘోరంగా ఓడిపోతారు అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2019 ఎన్నికల సమయంలో ఏపీలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో…
పథకాల కన్నా ఎక్కువ నష్టం చేసింది అధికార దుర్వినియోగమే – ఆ తప్పును గుర్తించలేకపోయిన వైసీపీ !
2019లో 151 సీట్లు 50 శాతం ఓట్లతో తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలోనే ప్రజావిశ్వాసం కోల్పోయారు. పది శాతానికిపైగా ఓట్లను కోల్పోయారు. అధికారాన్ని…