ఒకప్పటి మిస్ యూనివర్స్, బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశీ రౌతేలా నటించిన సినిమాలు తక్కువే అయినా పాపులారిటీ బాగా సంపాదించుకుంది. కమర్షియల్ యాడ్స్, ఫోటోషూట్స్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతంచేసుకుంది. హీరోయిన్ గా కన్నా ఐటెం సాంగ్స్ తోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటోంది. అయితే ఇప్పటివరకూ ఊర్వశి స్టెప్పులేసిన ఏ సాంగ్ సూపర్ హిట్ అవలేదు..ఆ సినిమాలు కూడా హిట్ టాక్ సొంతం చేసుకోలేదు. అయినా ఆఫర్లు మాత్రం వస్తూనే ఉన్నాయి
వరుస ఆఫర్లు
టాలీవుడ్ లో ప్రస్తుతం ఊర్వశి హాట్ ఫేవరేట్ గా మారిపోయింది. మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్యలో బాసు వేర్ ఈజ్ ద పార్టీ సాంగ్ లో తెలుగులో తొలిసారిగా మెరిసింది. ఆ సాంగ్ కోసం కోటికి పైగానే రెమ్యునరేషన్ అందుకుందని టాక్. ఆ తర్వాత అఖిల్ ఏజెంట్, పవన్ కళ్యాణ్ బ్రో, రామ్ పోతినేని స్కంద సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. నాలుగైదు నిముషాలున్న ఈ సాంగ్ కోసం ఊర్వశి బాగానే వసూలు చేసింది. త్వరలో మరికొన్ని పెద్ద సినిమల్లోనూ ఛాన్సులు కొట్టేసింది ఊర్వశి. ఒక్కో సాంగ్ కి కోటి నుంచి రెండు కోట్ల రూపాయలు తీసుకుంటోందని టాక్.
ఒక్క హిట్టూ లేదు
వరుస ఆఫర్లు అందుకుంటోంది అనేమాటే కానీ ఊర్వశి రౌతేలా స్టెప్పులేసిన ఒక్క సాంగ్ కూడా ఇప్పటివరకూ హిట్టవలేదు. ఆ సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. వాల్తేరు వీరయ్య ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. పవన్ కళ్యాణ్-సాయిధరమ్ తేజ్ నటించి బ్రో ఓ వర్గం ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఏజెంట్ సంగతి చెప్పుకోడానికేం లేదు..బాక్సాఫీస్ దగ్గర అడ్డంగా బోల్తాపడింది. అఖిల్ వరుస డిజాస్టర్స్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది ఏజెంట్. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న స్కంద కూడా పాజిటివ్ టాక్ తెచ్చికోలేదు. ఇందులో కల్ట్ మామ సాంగ్ కూడా సోసో గా ఉంది కానీ మూవీకి పెద్దగా కలిసొచ్చిందేం లేదు. దీంతో ఊర్వశి చిందేస్తే ఆ మూవీ సక్సెస్ డౌటే అనే సెంటిమెంట్ బలపడుతోంది. అయినప్పటికీ ఆఫర్లు వస్తూనే ఉన్నాయంటే లక్కు బాగానే ఉంది మరి..