యూరిక్ యాసిడ్, డయాబెటిస్ ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న సమస్యలు. ముఖ్యంగా యూరిక్ యాసిడ్ మోతాదులు పెరిగితే అది సాధారణంగా కాలి బొటనవేలి ఎముకల మధ్యనో లేదా ఏ మోకాలు ప్రాంతంలోనో ఓ స్ఫటికంగా రూపొందుతుంది. అక్కడి ఎముకలతో ఒరుసుకుపోతూ తీవ్రమైన నొప్పి వస్తుంది. దీన్నే గౌట్ సమస్య అంటారు. మనం తీసుకునే ఆహారంలోని ప్యూరిన్స్ విచ్ఛిన్నం అయినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. దీర్ఘకాలం యూరిక్ యాసిడ్ మోతాదులు ఎక్కువగా ఉంటే గుండె, మూత్రపిండాలు, కాలేయం వంటి అవయవాలపై దుష్ప్రభావం చూపుతుంది.
ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో యూరిక్ యాసిడ్ ప్రమాణాలు 3.5 mg/dL నుంచి 7.2 mg/dL ఉండాలి
మహిళల్లో గరిష్ట మోతాదు 6.2 mg/dL వరకే ఉండాలి
తిప్పతీగ అద్బుతమైన ఔషధం
యూరిక్ యాసిడ్ సమస్యకు చెక్ పెట్టడానికి ప్యూరిన్ అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. దీని స్థాయిలు తగ్గించడానికి రకరకాల మెడిసిన్స్ ఉన్నాయి. అయితే ఆయుర్వేదంలోనూ మంచి మందులున్నాయి. ముఖ్యంగా శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడానికి తిప్ప తీగ సహాయపడుతుందని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. ఆయుర్వేదంలో వాడే అద్భుతమైన ఔషధ మొక్క తిప్పతీగ. సంస్కృతంలో దీన్ని అమృతవల్లి అంటారు. దీని ఆకులు, కాండం, పువ్వు, వేరు, విత్తనం…ఇలా మొక్క మొత్తం ఔషధగుణాలు నిండి ఉంటాయి. ఇందులో మినరల్స్, లవణాలు ఎక్కువగా ఉంటాయి. దీని ఔషధ గుణాలు చాలావరకు కాండం, ఆకుల్లో ఉంటాయి. యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది, రోగనిరోధకశక్తిని మెరుగుపరుస్తుంది…ముఖ్యంగా యూరిక్ యాసిడ్ సమస్యకు చెక్ పెట్టడానికి అద్భుతమైన మూలిక ఇది అని ఓ అధ్యయనం స్పష్టం చేసింది.
ఇతర అనారోగ్య సమస్యలకు తిప్పతీగ!
తిప్పతీగతో తయారు చేసిన మందులు, పదార్థాలు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి. శరరీంలోని కణాలు దెబ్బతినకుండా ఉండేందుకు వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. పలు రకాల వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడగల గుణాలతో పాటూ…రక్తాన్ని శుభ్రపరచడంలోనూ తిప్పతీగది ప్రధాన పాత్ర. ఆయుర్వేదంలో ప్రత్యేక నిపుణులు కొందరు తిప్పతీగతో హృదయ సంబంధిత వ్యాధుల బారినపడకుండా మందులు తయారు చేస్తారు. సీజనల్ వ్యాధులు విష జ్వరాలైన డెంగ్యూ, స్వైన్ ఫ్లూ మలేరియా వంటి వాటిని పూర్తిగా నివారించగల శక్తి తిప్పతీగకు ఉంటుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచే శక్తి తిప్పతీగకు ఉంటుంది. కాస్త తిప్పతీగ పొడిని కాస్త బెల్లంలో కలుపుకుని తింటే చాలు అజీర్తి సమస్య పోతుంది. తిప్పతీగలో మధుమేహాన్ని నివారించే గుణాలున్నాయి. ముఖ్యంగా టైప్ 2 మధుమేహం తగ్గేందుకు ఇది ఉపయోగపడుతుంది. తిప్పతీగతో తయారు చేసిన మందుల్ని ఉపయోగించడం ద్వారా మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం