ఏకమైన హిందువులు – పులకరించిన భారత్ !

భారత్‌ను ఏకం చేయడం అంటే ఇదే. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరూ ఏకమయ్యారు. దేశమయ్యారు. రామయ్య భజనలో మునిగి తేలింది. అయోధ్య వైపే దేశం మొత్తం చూసింది. గతంలో ఎప్పుడైనా దేశం మొత్తం ఇలా ఒక అంశానికి మద్దతు తెలిపిన సందర్భాలు ఉన్నాయా . లేనే లేవు. ప్రతీ దానికి కులాన్ని..మతాన్ని తీసుకు వచ్చి దేశాన్ని విభజించే రాజకీయాలు చేసే వారు మధ్యలో దూరిపోయారు. నిన్న కూడా అలాంటి ప్రయత్నమే జరిగింది. కానీ దేశప్రజలు పట్టించుకోలేదు.

హిందూ ప్రపంచం ఏకమై పులకించిన సందర్భం

ఐదు వందల ఏళ్లగా ఆవాసం కోల్పోయిన రాముడు అయోధ్యకు వచ్చాడు. ఇంత కాలం రాముడికి ఆ స్థానం దూరం చేసిందెవరు..? అంతా తెలిసిన తర్వాత కూడా ఎందుకు గుడి కట్టలేకపోయారు .. చిన్న టెంట్ లో రాముడ్ని ఎందుకు ఉంచాల్సి వచ్చింది… ఇదంతా చరిత్ర కానీ.. ఎప్పుడైనా ఓ యుగపురుషుడు వస్తాడు… ఇప్పుడు మోదీ రూపంలో వచ్చాడు. అయోధ్య పురిలో రాముడికి ప్రాణ ప్రతిష్ట చేశారు. ఈ సందర్భంగా హిందూ ప్రపంచం అంతా భక్తి శ్రద్ధలతో రాములవారిని స్మరించుకుంది.

ఇక దేశాన్ని విభజించే కుట్రలకు చెక్ పడినట్లే

అయోధ్య రామాలయ ప్రారంభానికి వచ్చిన స్పందన.. ప్రజల నుంచి వచ్చిన సానుకూల సందేశం చూస్తే ఇక దేశం మొత్తం ఏకతాటిపైకి వచ్చినట్లేనని చెప్పుకోక తప్పదు. ఇప్పుడు కులం లేదు మతం లేదు.. ప్రాంతం లేదు.. అంతా భారతీయ హిందూత్వమే ఉంది. హిందూత్వం అంటే కులం కాదు.. జీవన విధానం అని బీజేపీ , ఆరెస్సెస్ చెబుతూ ఉంటారు ఇప్పుడా విధానాన్ని అయోధ్య ద్వారా ప్రజలంతా అన్వయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇక ఎవరూ దేశాన్ని విభజించలేరు.

చీల్చే కుట్రల్ని పట్టించుకోకపోవడమే సాక్ష్యం !

ఓ వైపు దేశమంతా బాలరాముని ప్రాణప్రతిష్ట వైపు చూస్తూంటే. రాహుల్ గాంధీ ఓ చోట ఆలయంలోకి పంపించలేదని.. ఆందోళనకు దిగారు. తనపై దాడి జరిగిందని చెప్పుకొచ్చారు. ఆయన పార్టీ నేతల్ని రోడ్లపైకి పంపారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఇక తాము కుట్రల్లో పడబోమని క్లారిటీ ఇచ్చినట్లయింది. ప్రజలు ఇప్పుడు హిందూత్వ భారత్ వైపు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు.