తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్…!

తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేశారు.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు కారణాలేంటని డీజీపీని ప్రశ్నించిన కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కారణం చూపకుండా ఎలా అరెస్టు చేస్తారని డీపీజీని కిషన్ రెడ్డి అడిగారు. అయితే కేసు వివరాలు కాసేపటి తర్వాత తెలియజేస్తామని ఈ సందర్భంగా డీజీపీ కిషన్ రెడ్డికి సమాధానం ఇచ్చారు. అంటే.. ఇంత హంగామా జరుగుతున్నప్పటికీ.. ఏ కేసులో బండి సంజయ్ ను అరెస్టు చేశారో డీజీపీకి కూడా తెలియకపోవడం తెలంగాణలో పోలీసు వ్యవస్థ పనిచేస్తున్న తీరుకు నిదర్శనమన్నారు కిషన్ రెడ్డి.