ఒకటవ తరగతిలో పిల్లలను చేర్చాలంటే కనీస వయస్సు ఎంతో తెలుసా..!

ఒకటవ తరగతి విద్యార్థులకు వయస్సు తప్పనిసరిగా ఆరేళ్లు ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి ఒకటవ తరగతిలో ప్రవేశం పొందేందుకు విద్యార్థులకు కనీస వయసును ఆరేళ్లుగా నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. నూతన జాతీయ విద్యా విధానం (National education policy) ప్రకారం తొలి ఐదేళ్లు విద్యార్థులకు నేర్చుకునే అవకాశం కల్పించాలని ఇందుకోసం గట్టి పునాది ఉండాలని అభిప్రాయపడింది. ఇందుకోసం తొలి మూడు సంవత్సరాలు ప్రీస్కూల్ విద్య, ఆ తరువాత ఒకటవ తరగతి రెండవ తరగతులు ఉంటాయని వెల్లడించింది.

ఈ కొత్త విధానం వల్ల పిల్లల్లో సొంతంగా నేర్చుకోవడం, చదువుకోవడం వంటివి అలవడుతాయని అదే సమయంలో పిల్లలు కూడా అభివృద్ధి చెందుతారని కేంద్రం భావిస్తోంది. అంగన్‌వాడీలు లేదా ప్రభుత్వ, ప్రభుత్వ-సహాయక, ప్రైవేట్ మరియు NGOలలో చదువుతున్న పిల్లలందరికీ మూడు సంవత్సరాల నాణ్యమైన ప్రీస్కూల్ విద్యను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుందని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది.

Union govt directs all state govts and UTs to have minimum six years of age for 1st class admission
అప్పను, గాలి జనార్దన్ రెడ్డిని జైలుకు పంపించింది ఎవరు ? సవతి తల్లి ప్రేమ, బంజరు భూముల పార్టీ, అశోక్ ! అప్పను, గాలి జనార్దన్ రెడ్డిని జైలుకు పంపించింది ఎవరు ? సవతి తల్లి ప్రేమ, బంజరు భూముల పార్టీ, అశోక్ !
ఇందుకోసమే ప్రీ స్కూళ్లను నడపాలంటూ విద్యాశాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఈ క్రమంలోనే కేంద్ర విద్యాశాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఒకటవ తరగతి ప్రవేశానికి కనీస వయస్సు ఆరేళ్లు లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలని సూచనలు ఇచ్చింది.ప్రస్తుతం ఒకటవ తరగతి ప్రవేశం కోసం పిల్లలకు కనీస వయసు ఐదేళ్లుగా ఉంది. ఈ వయస్సును ఆరేళ్లకు పెంచాలనే అంశం గతంలో చర్చకు వచ్చింది. అయితే జాతీయ విద్యా విధానంను ఆయా రాష్ట్రాలు అమలు చేస్తే ఒకటవ తరగతి ప్రవేశంకు కనీస వయసు ఆరేళ్లు ఉండాలన్న నిబంధనను తీసుకురాగలమని గతంలో కేంద్రం వివరణ ఇచ్చింది. ఒకప్పుడున్న విద్యావిధానం 10+2 స్ట్రక్చర్‌గా ఉండేది. అయితే నూతన విద్యా విధానం ప్రకారం 5+3+3 స్ట్రక్చర్‌గా మారింది. ఇందులో 3 నుంచి 8 ఏళ్ల వయసున్న వారిని ఫౌండేషనల్ స్టేజ్ కింద విభజించడం జరిగింది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి చర్చ లేదా ఆదేశాలు ఇవ్వలేదు.