తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ ఊహించని వ్యూహాలు – వారంలో బీజేపీ సంచలన నిర్ణయాలు !

తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని ఎలా అధికారంలోకి తీసుకు రావాలన్నదానిపై హైకమాండ్ ఇప్పటికే ఓ బ్లూప్లింట్ రెడీ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి స్థాయి కసరత్తు పూర్తయిందని ఇక మాస్టర్ ప్లాన్ అమలు చేయడమే మిగిలిందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఎప్పటిలాగా సాదాసీదా మార్పు చేర్పులు మాత్రమే కాకుండా ఎవరూ ఊహించని చేరికలతో రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ అనూహ్యమైన రీతిలో ప్రాంతీయ పార్టీలకు షాక్ ఇవ్వబోతోందని చెబుతున్నారు . ఈ వారంలోనే ఈ కార్యచరణ అమలు ప్రారంభమవుతుందని అంటున్నారు.

తెలంగాణ కమల వికాసానికి మాస్టర్ బ్లూ ప్రింట్

తెలంంగాణలో బీజేపీ అధికారం సాధించడం ఖాయమనుకున్న దశలో కర్ణాటక ఎన్నికల తర్వాత ఒక్క సారిగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వ్యూహాత్మకంగా బీజేపీని రేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించాయి. తామే వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థులమన్నట్లుగా ఆ రెండు పార్టీలు వ్యవహరిస్తూ..బీజేపీని సైడ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీనికి విరుగుడుగా బీజేపీ పక్కా వ్యూహం ఖరారైపోయింది. అదే సమయంలో పార్టీ నేతల మధ్య ఉన్న అంతర్గత సమస్యలను కూడా పరిష్కరిచి.. వన్ షాట్ టు బర్డ్స్ తరహాలో పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేయడానికి ఏర్పాట్లూ పూర్తయ్యాయని అంటున్నారు. తెలంగాణ బీజేపీలో వచ్చే వారం తర్వాత ఎవరూ ఊహించని చేరికలు ఉంటాయని.. ఆ చేరికలతో బీజేపీకి తిరుగులేదన్న వాతావరణం ఏర్పడుతుందని చెబుతున్నారు.

ఏపీలో ఎవరూ ఊహించని ట్విస్టులు ఇవ్వనున్న హైకమాండ్

ఏపీ బీజేపీ విషయంలో హైకమాండ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. రెండు ప్రాంతీయ పార్టీలు తమ మనుగడ కోసం అన్ని రకాల ట్రిక్స్ ప్లే చేస్తూండటంతో వాటికి చెక్ పెట్టేలా ఓ అద్భుతమైన ప్రణాళికను హైకమాండ్ రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణతో పాటే ఏపీలోనూ పార్టీని ప్రధానంగా రేసులోకి తీసుకు వచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలను వరుసగా తీసుకోబోతున్నారని అంటున్నారు. అ వ్యూహాలను అమలు చేసే క్రమంలో.. తర్వాత ఏం జరుగుతుందన్నది ఏపీ పార్టీ నేతలకు కూడా తెలియదని.. అంతా హైకమాండ్ నడిపిస్తుందని చెబుతున్నారు.

దక్షిణాదిపై సీరియస్‌గా దృష్టి పెట్టిన బీజేపీ !

ఉత్తరాదిలో తిరుగులేని శక్తిగా ఉన్న బీజేపీ.. ఇప్పుడు దక్షిణాదిలోనూ బలపడటానికి గట్టిగా ప్రయత్నిస్తోంది. కర్ణాటక ఎన్నికల వరకూ ఓ మూసగా ప్రయత్నించినప్పటికీ.. ఇక ముందు.. మాత్రం కొత్త పద్దతిలో దక్షిణాదికి మాత్రమే సరిపోయే రాజకీయ వ్యూహాలను అమలు చేయాలనుకుంటున్నారు. దీనిపై వచ్చే వారమే అత్యంత కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.