ఇంటి ముందు తులసి మొక్కలో వచ్చే ఈ మార్పులు దేనికి సంకేతం!

మీ ఇంట్లో తులసి మొక్క ఎలా ఉంది? పచ్చగా ఏపుగా పెరుగుతోందా – ఎన్నిసార్లు పెట్టినా ఎండిపోతుందా? ఎందుకిలా జరుగుతోందనే టెన్షన్ ఉందా? తులసి మొక్కలో మార్పులు దేనికి సంకేతం…

రోజూ నిద్ర లేవగానే తులసి మొక్కను చూడడం, స్నానం అనంతరం ప్రదక్షిణలు చేయడం వల్ల సప్త ద్వీపాలతో కూడిన సమస్త భూ మండలాన్ని, అందులోని తీర్థాలను, క్షేత్రాలను దర్శించినంత పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతారు. తులసి మొక్కను నాటినా, నీరు పోసినా, తాకినా, పెంచిన మోక్షం సిద్ధిస్తుందంటారు. అందుకే తులసిని దేవతా వృక్షంగా భావిస్తారు హిందువులు. అలాంటి పరమ పవిత్రమైన చెట్టు కేవలం దైవ సంబంధమైన పూజకే కాదు చాలా విషయాలను సూచిస్తాయి. ఎందుకంటే తులసి మొక్కకి ఒక్కోసారి నీళ్లుపోయికపోయినా ఏపుగా పెరుగుతుంది. ఇంకోసారి ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఎండిపోతుంది. మరోసారి రంగులు మారుతుంటుంది. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఇలా జరుగుతోందేంటనే భావన చాలామందికి కలుగుతుంది. అయితే కేవలం హెచ్చరికలు మాత్రమే…

తులసి మొక్కలో మార్పులకు సంకేతాలివే
తులసి చెట్టు ఎప్పుడూ పచ్చగా ఉంటే ఆ ఇంట్లో ఆనందం, సంతోషం ఉంటాయి. ఇంట్లో వారికి ఎలాంటి సమస్యలు రావని అర్థం. ఒకవేళ నీళ్ళు పోయకున్నా తులసి మొక్క బాగా పచ్చగా, ఏపుగా పెరుగుతున్నా, ఆ మొక్క చుట్టూ చిన్న చిన్న మొక్కలు మరికొన్ని వచ్చినా ఇంట్లో వారికి అదృష్టం కలిసి వస్తుందని చెబుతారు. పచ్చగా కళకళలాడుతున్న తులసి ఆకులు అకస్మాత్తుగా ఎండిపోతే ఆ ఇంటి యజమానికి ఆరోగ్యపరంగా కీడు జరుగబోతోందని అర్థం. అంటే అనారోగ్యం బారిన పడతారని హెచ్చరిక. ఆకులు ఉన్నట్టుండి రంగుమారితే ఇంట్లో ఉన్నవారు క్షుద్ర శక్తుల బారిన పడనున్నారని అర్థం. ఎవరైనా గిట్టనివారు క్షుద్రశక్తులు ప్రయోగించినప్పుడే తులసి ఆకులు రంగు మారుతాయని చెబుతారు. పితృ దోషం ఉంటే కూడా తులసి మొక్క ఎండిపోతుంది. తులసి మొక్క చుట్టూ పక్షులు గూడు కట్టుకుంటే అపశకునంగా భావించాలని ఇలా జరిగితే ఆ ఇంట్లో అశాంతి నెలకొంటుందని పండితులు చెబుతారు. అందుకే తులసి మొక్కకు భక్తితో పూజ చేయడమే కాదు మొక్కలో మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి,పచ్చగా కళకళలాడేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.