తెలుగు రాష్ట్రాల్లో త్రిలింగ క్షేత్రాలివే – మీరు దర్శించుకున్నారా!

పరమేశ్వరుడు కొలువైన జ్యోతిర్లింగ క్షేత్రాలు, పంచారామాలు, పంచభూతలింగాలు ఇవెంత ప్రత్యేకమో వాటితో సమానమైన ప్రాశస్త్యంత్రిలింగ క్షేత్రాలకు ఉంది. అయితే వీటిని దర్శించుకునేందుకు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు..ఈ మూడు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి..

శ్రీశైల క్షేత్రం జ్యోతిర్లింగాలలో ఒకటి, కాళేశ్వరాన్ని దక్షిణకాశిగా పిలుస్తారు, పంచరామాల్లో ఒకటి దాక్షారామం. ఈ మూడు శైవ క్షేత్రాలను కలిపి త్రిలింగ క్షేత్రాలు లేదా త్రిలింగ దేవాలయాలు అని పిలుస్తారు. ఈ త్రిలింగ క్షేత్రాల మధ్య ఉన్న ప్రాంతమే కాలక్రమంలో తెలంగాణగా మారినట్లు చెబుతారు. ఈ మూడు క్షేత్రాల్లో దేనికవే ప్రత్యేకం.

శ్రీశైలం, కర్నూలు
శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి శ్రీశైలంలో కొలువయ్యాడు. పరమేశ్వరుడి 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఇదొకటి. పార్వతీ దేవి అష్టాదశ శక్తి పీఠాల్లో శ్రీశైలం ఒకటి. ఇక్కడ స్వామి అమ్మవార్లను ఎప్పుడు దర్శించుకున్నా మంచిదే కానీ శ్రావణమాసంలో దర్శించుకుంటే మరింత మంచిందని చెబుతారు. వ్యవసాయ దారులు శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామిని దర్శించుకున్న తర్వాత వ్యవసాయ పనులు ప్రారంభిస్తే మంచి దిగుబడి వస్తుందనే విశ్వాసం ఉంది.

ద్రాక్షారామం, తూర్పుగోదావరి
భీమవరంలో సోమేశ్వర ఆలయం 2 కిలోమీటర్ల దూరంలోని గునుపూడి లో ఉంది. ఇది పంచారామ క్షేత్రాలలో ఒకటి. ఇక్కడి లింగాన్ని స్వయంగా చంద్రుడు ప్రతిష్టించాడని స్థల పురాణంలో చెబుతోంది. అందుకే చంద్రుడి పేరు మీద ఇక్కడి స్వామివారిని సోమేశ్వర స్వామి అని అంటారు. ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే అమావాస్య నాడు బూడిద లేదా గోధుమ రంగులో…పౌర్ణమికి తెలుపు రంగులో స్వామి వారు దర్శనమిస్తాడు.

కాళేశ్వరం, కరీంనగర్
పవిత్ర గోదారవరి నదికి ఉపనది అయిన ప్రాణహిత కలిసే చోట ఉంది కాళేశ్వర క్షేత్రం. ఈ ఆలయం పేరు మీదుగానే తెలంగాణలో అతిపెద్ద ప్రాజెక్టుకు కాళేశ్వరం ప్రాజెక్టు అనే పేరు పెట్టారు. సాధారణంగా ఏ గర్భగుడిలో అయినా ఒక శివలింగం ఉంటుంది కానీ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం గర్భగుడిలో రెండు శివలింగాలుంటాయి. ఒక శివలింగాన్ని ముక్తేశ్వరుడిగా, మరొకటేమో కాళేశ్వరునిదిగా(యముడు) గా పూజిస్తారు. ఇంత ప్రత్యేకత ఉన్న ఆలయం భారతదేశంలో ఎక్కడా కనిపించదు

గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.