హడావుడి లేకుండా OTTలోకి వచ్చేసిన టైమ్ ట్రావెల్ మూవీ ‘7:11 PM’

సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతుంది. ఆదిత్య 369, సూర్య 24, ప్రశాంత్ వర్మ అ!, ఒకే ఒక జీవితం, బింబిసార..ఇవన్నీ ఈ బ్యాక్ డ్రాప్ లో వచ్చి మంచి టాక్ సొంతం చేసుకున్నవే. సేమ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన రీసెంట్ మూవీ 7:11 PM . జూలై 7న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది.

25 ఏళ్లు ముందుకెళ్లిన కథ
హంసలదీవికి చెందిన యువకుడిగా నటించిన సాహస్ పగడాల ఎప్పుడూ తన ఊరు బాగుండాలని తపిస్తుంటాడు. కానీ కొంతమంది స్వార్థపరుల కుట్రల నుంచి గ్రామ ప్రజల్ని, వాళ్ల మ్యూచ్‌వల్‌ ఫండ్ కంపెనీలో పొదుపు చేసుకున్న డబ్బునీ కాపాడే ప్రయత్నం చేస్తాడు. ఓ రోజు అనుకోకుండా ఆ ఊళ్లోకి వచ్చిన ఓ బస్సు ఎక్కుతాడు. కళ్లు తెరచి చూస్తే తను ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఉంటాడు. పైగా తను బస్సు ఎక్కింది 1999లో అయితే మెల్‌బోర్న్‌ 2024 కాలం నడుస్తుంటుంది. 25 ఏళ్ల కాలం తను ముందుకి ఎలా ప్రయాణం చేశాడు? ఈ క్రమంలో తన ఊరిలో వచ్చిన మార్పులేంటి, తన ప్రియురాలిని మళ్లీ కలుసుకున్నాడా? ఇదే స్టోరీ.

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్
జూలైలో విడుదలైన ఈ మూవీకి డివైడ్ టాక్ వచ్చింది. ఎలాంటి మందస్తు ప్రకటనా లేకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది 7:11 PM. చైతు మాదాల దర్శకత్వంలో ఆర్కస్ ఫిల్మ్స్ బ్యానర్‍పై నరేన్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి నిర్మించారు. గ్యాని సంగీత దర్శకుడు. కొన్ని సినిమాలు థియేటర్లలో మంచి ఫలితం రాబట్టలేకున్నా ఓటీటీలో మాత్రం బానే ఉన్నాయి అనిపిస్తాయి. పైగా ఇలాంటి టైమ్ ట్రావెల్ సినిమాల విషయంలో థియేటర్లలో అంత త్వరగా అర్థంకాకున్నా ఓటీటీల్లో ఎంజాయ్ చేస్తారు. ఈ జోనర్ సినిమాలు నచ్చే ప్రేక్షకులను అస్సలు నిరాశపర్చదు 7:11 PM మూవీ. ఈ వీకెండ్ ఓటీటీలో హ్యాపీగా చూసేయొచ్చు..