ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీజేపీ స్వింగ్ మీద ఉంది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని బాల్కొండ నియోజకవర్గ పరిధిలో మరితం బలంగా ఉంది. నియోజకవర్గంలో మంచి పేరు ఉన్న ఏలేటి అన్నపూర్ణమ్మ కుటుంబం బీజేపీలో చేరి బాల్కొండ నుంచి పోటీ చేస్తున్నారు. ఎంపీ అర్వింద్ యాదవ్ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని బాల్కొండలో రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నారు.
అన్నపూర్ణమ్మపై ప్రజల్లో ప్రత్యేక అభిమానం
బాల్కొండ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఏలేటి అన్నపూర్ణ దేవీ పోటీ చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఆమె కుమారుడు మల్లిఖార్జున రెడ్డి ఈ నియోకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అన్నపూర్ణమ్మ గతంలో ఆర్మూరు నుంచి 1994-99లో, 2009-14 వరకు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఈసారి ఆయన కుమారుడు మల్లిఖార్జున రెడ్డి మళ్లీ పోటీ చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. చివరి నిమిషంలో అన్మపూర్ణమ్మ అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది.
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 14వేల ఓట్ల ఆధిక్యం
2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైనప్పటికీ.. తర్వాత ఐదు నెలల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ వేగం పుంజుకుంది. బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కన్నా బీజేపీకి పధ్నాలుగు వేల ఓట్ల మెజార్టీ వచ్చింది. అంటే బీజేపీ ఎంత వేగంగా పుంజుకుందో అర్థం చేసుకోవచ్చు. . అప్పటితో పోలిస్తే ఇప్పుడు మరింతగా బీజేపీ బలపడిందని అంచనా వేస్తున్నారు.
మంత్రి ప్రశాంత్ రెడ్డిపై ప్రజా వ్యతిరేకత
బాల్కొండ నుంచి ముచ్చటగా మూడోసారి గెలిచేందుకు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ప్రతి గ్రామాన్ని చుట్టేస్తున్నారు. తన హయాంలో చేసిన అభివృద్ధితో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రధానంగా సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. అలాగే ఈసారి ఎన్నికల్లో గెలిస్తే చేపట్టబోయే పనుల గురించి వివరిస్తున్నారు. కేసీఆర్ భరోసా పేరిట మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తున్నారు. కానీ పదేళ్లలో ఏమీ చేయని ప్రశాంత్ రెడ్డి .. మళ్లీ గెలిపిస్తే ఏం చేస్తారన్ నప్రశ్నలు వస్తున్నాయి.
కాంగ్రెస్ అభ్యర్థి కూడా గట్టిపోటీ ఇచ్చే చాన్స్
మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న బాల్కొండ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి ముత్యాల సునీల్‌కుమార్ రెండో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ.. ఆ పార్టీ టికెట్టు ఇవ్వలేదు. దీంతో ఆయన చివరినిమిషంలో బీఎస్పీ నుంచి పోటీ చేసి మంత్రికి గట్టి పోటీ ఇచ్చారు. బీఎస్పీ నుంచి పోటీ చేసినప్పటికీ.. 41,254 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన ఈరవత్రి అనిల్ 30,433 ఓట్లు సాధించారు. కానీ ఈ సారి ఎన్నికల్లో ముత్యాల సునీల్‌కుమార్‌కు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కేటాయించింది. ఆయన కూడా బలంగానే కనిపిస్తున్నారు.
బాల్కొండలో త్రిముఖ పోటీ ఏర్పడినా.. స్థిరమైన ఓటు బ్యాంక్.. ప్రస్తుత రాజకీయవాతావరణంలో ఉన్న బీజేపీకి పాజిటివ్ టాక్ దృష్టా.. ఏలేటి అన్నపూర్ణమ్మ మరోసారి అసెంబ్లీకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.