ఇప్పటి వరకూ ఓ లెక్క.. ఇక నుంచి మరో లెక్క – మోదీ సభ తర్వాత జరిగేది ఇదే !

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణలో బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొనబోతున్నారు. ఇది ఆషామాషీ సభ కాదు. సాదాసీదా ఎన్నికల ప్రచార సభ కాదు. తెలంగాణ రాజకీయాల్ని పూర్తిగా మార్చేసే సభ. బీసీ ఆత్మగౌరవం కోసం బీజేపీ ఏం చేయబోతోందో మోదీ ప్రకటించబోతున్నారు. ఇప్పటికే బీజేపీ సీఎం అభ్యర్థిగా బీసీని ప్రకటిస్తామని స్పష్టం చేశారు. దీంతో ఆ సీఎం అభ్యర్థిని మోదీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ప్రకటించకపోయినా బీసీ నినాదం మాత్రం ప్రజల్లోకి వెళ్లిపోతుంది. ప్రధాని మోదీ స్వయంగా ఓబీసీ వర్గానికి చెందిన వారు కావడంతో తెలంగాణ బీసీల్లో కదలిక వస్తోంది. తమ నాయకుడు తమ కోసం వస్తున్నారని.. తను రాజకీయంగా ఎదిగేందుకు సహకారం అందిస్తున్నారని వారంతా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

బీసీల కోసం మరిన్ని వరాలు ప్రకటించనున్న మోదీ

తెలంగాణ జనాభాలో సగానికిపైగా బీసీలు ఉన్నారు. కానీ రాజ్యాధికారంలో వారు ఎక్కడ ఉన్నారో చెప్పాల్సిన పని లేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చెరో ఇరవై సీట్లను మాత్రమే ఇచ్చాయి. అంటే పదిహేను శాతం కూడా లేదు. అదే సమయంలో టిక్కెట్ ఇస్తే గెలుచుని వచ్చేలా ఉండాలని.. ఆషామాషీగా ఇవ్వకూడదని.. ముదిరాజ్‌లకు టిక్కెట్లు ఇవ్వకపోవడంపై కేసీఆర్ కామెంట్ చేశారు. అంటే బీసీలకు గెలిచే సామర్థ్యం లేదన్నట్లుగా మాట్లాడటం బీసీ వర్గాలను కించ పరిచినట్లయింది. అందుకే బీజేపీ అత్యధికత మందికి బీసీలకు సీట్లిచ్చి గెలిపించుకునేందుకు సిద్ధమయింది.

కాంగ్రెస్, బీఆర్ఎస్ ల కన్నా డబుల్ సీట్లు ఇవ్వబోతున్న బీజేపీ

బీసీలకు కాంగ్రెస్, బీజేపీల కన్నా ఎక్కువ సీట్లు ఇవ్వబోతోంది. కనీసం నలభై సీట్లు బీజేపీకి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకూ ప్రకటించిన జాబితాల్లో పాతికపైగా సీట్లను ప్రకటించారు. పెండింగ్ ఉన్న వాటిల్లో అత్యధికం బీసీ వర్గాలకు ప్రకటించబోతున్నారు. ప్రదాని మోదీ బహిరంగసభలో బీసీల కోసం ప్రత్యేకమైన హామీలు కూడా ఇచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో బీజేపీకి అధికారం ఇస్తే బీసీ సీఎం మాత్రమే కాదు.. అంతకు మించిన హామీలు ఇచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో మొత్తం రాజకీయాధికారం బీసీల గుప్పిట్లో పెట్టేందుకు అవసరమైన కార్యాచరణను మోదీ వెల్లడించే అవకాశం ఉంది.

బీసీల కోసం కిషన్ రెడ్డి వంటి అగ్రనేతల త్యాగం

బీసీలకు తెలంగాణలో రాజ్యాధికారం ఇవ్వాలన్న లక్ష్యంతో ఉన్న హైకమాండ్ నిర్ణయానికి కిషన్ రెడ్డి వంటి అగ్రనేతలు త్యాగం చేశారు. అంబర్ పేట నియోజకవర్గంలో సులువుగా గెలిచే అవకాశం ఉన్నప్పటికీ.. తనకు కానీ.. తన కుటుంబసభ్యులకు కానీ కిషన్ రెడ్డి టిక్కెట్ కోరుకోలేదు. బీసీ నేత అయిన కృష్ణాయాదవ్ కు టిక్కెట్ కేటాయింప చేశారు. బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని.. బీసీసీఎం అభ్యర్థిని నిర్ణయించాలనుకున్నారు కాబట్టే… హైకమాండ్ తనను పోటీకి దూరంగా ఉండమని ఆదేశించిందని కిషన్ రెడ్డి ప్రకటించారు. బీసీల కోసం త్యాగాలు చేయడానికి బీజేపీ నేతలే ముందుంటారని మరోసారి నిరూపితమయింది.