పుష్ప..పుష్ప రాజ్…తగ్గేదే లే.. ఈ డైలాగ్స్ లేపిన రచ్చ అంతా ఇంతా కాదు. మాటలొచ్చిన పిల్లాడి దగ్గర్నుంచి ముసలాడి వరకూ పూనకాలు తెప్పించింది. అల్లు అర్జున్ లుక్ , మాట్లాడే భాష…నెక్స్ట్ లెవెవ్ అంతే. పాన్ ఇండియా మూవీగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రిలీజైన రోజు డివైడ్ టాక్ వచ్చినా ఆతర్వాత బాక్సాఫీస్ ను షేక్ చేసింది. సౌత్-నార్త్ అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా కుమ్మిపడేసింది. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన పుష్ప -1…పెళ్లి సీన్ ఓ వైపు…పుష్ప రాజ్ ఇచ్చిన షాక్ లో ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ ఆలోచనలో ఉండగా ఎండ్ కార్డ్ పడింది… ఇక్కడి నుంచి రెండో భాగం ప్రారంభం అవుతుంది.
రెండో భాగంలో పుష్ప చనిపోయినట్టు ప్రచారం జరగడం… పులి రెండు అడుగులు వెనక్కు వేసిందంటే పుష్ప వచ్చాడని అర్థం అన్న డైలాగ్.. సీసీ ఫుటేజ్ లో పుష్పరాజ్ ని వెనుకనుంచి చూపంచడంతో ..పుష్ప 2 పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లేలా చేసింది రీసెంట్ గా విడుదల చేసిన బన్నీ పోస్టర్. గంగమ్మ తల్లి జాతరలో పురుషులంతా మహిళలుగా వేషం వేసుకుంటారు.. బన్నీ లుక్ కూడా అదే రిలీజ్ చేశారు. గతంలో ఎప్పుడూ ఏ హీరో కనిపించని లుక్ ఇది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఈ లుక్ ఇచ్చిన కిక్ ఇంకా దిగలేదు… ఇలాంటి టైమ్ లో మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది.
పుష్ప-2 సినిమాలోని ఇంటర్వెల్ సీన్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా పుష్ప-2 సినిమా నుంచి విడుదలైన పోస్టర్ సీన్.. ఇంటర్వెల్ సీన్ గా తెలుస్తోంది. ఇంటర్వెల్ కు ముందు పుష్పరాజ్ ఆ లుక్ లోనే కనిపించనున్నాడు. ఫస్ట్ లుక్ ద్వారా అభిమానుల్లో విపరీతమైన ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అదే లుక్ ఇంటర్వెల్ కు ముందు ఉంటుందని తెలియడంతో మరింత ఎగ్జైటింగ్ గా ఫీలవుతున్నారు బన్నీ ఫ్యాన్స్. సినిమా మొత్తం ఓ లెక్క..ఈ ఒక్క సీన్ మరో లెక్క అన్నట్టు షూట్ చేశాడట సుకుమార్. పైగా ఇంటర్వెల్ పోర్షన్ కావడంతో ఈ ఎపిసోడ్ పై చాలా ఫోకస్ పెట్టారు. 35 రోజుల పాటూ ఈ ఎపిసోడ్ షూట్ చేశారట.. అల్లు అర్జున్ మేకప్ కోసమే రోజుకి 3 గంటలు పట్టేదట. ఇవన్నీ విషయాలు బయటకు రావడంతో పుష్ప 2 పై అంచనాలు ఓ రేంజ్ కి చేరాయి. కేవలం ఇండియా మార్కెట్లోనే కాదు..ఇంటర్నేషనల్ మార్కెట్ ను కూడా దృష్టిలో పెట్టుకుని 2024 సమ్మర్లో ఈ సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు టాక్. మన దేశంలోనే కాదు అమెరికా రష్యా వంటి దేశాల్లో కూడా పుష్ప భారీ స్థాయిలో కలెక్షన్లు సాధించింది. దేశ వ్యాప్తంగా 300 కోట్ల రూపాయలు వసూలు చేస్తే.. కేవలం హిందీలోనే 100 కోట్ల రూపాయలొచ్చింది..ఇదీ పుష్పరాజ్ క్రేజ్…