తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్‌లో తోషాఖానా కేసు ఎలాంటి ప్రకంపనలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తన ఆస్తుల లెక్కలను చూపే క్రమంలో విదేశీ అతిథులు ఇచ్చిన బహుమతులపై లెక్కలు చూపలేదని ఆరోపణలు ఎదుర్కున్నారు…
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్‌లో తోషాఖానా కేసు ఎలాంటి ప్రకంపనలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తన ఆస్తుల లెక్కలను చూపే క్రమంలో విదేశీ అతిథులు ఇచ్చిన బహుమతులపై లెక్కలు చూపలేదని ఆరోపణలు ఎదుర్కున్నారు. ఆ కానుకలను ప్రభుత్వ ఖజానాలో జమ చేయకుండా తన వద్దే ఉంచుకున్నారు. 2002 నుంచి 2022 వరకు తోసాఖానా కుంభకోణంలో ఎవరు లబ్ధి పొందారనే వివరాలను ఆదివారం పాకిస్థాన్ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. అయితే ఇది కేవలం ఇమ్రాన్ ఖాన్‌కి మాత్రమే పరిమితం కాలేదు. ప్రస్తుత పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మొదలు.. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, దివంగత సైనిక నియంత పర్వేజ్ ముషారఫ్ ఎవరూ అతీథులు కాదు. పాకిస్థాన్ ప్రధానులు ఇలా తమ దేశానికి నష్టం కలిగించే చర్యలు చేస్తే.. మన ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఇతర దేశాధినేతల నుంచి తనకు లభించిన కానుకలను దేశానికే ఉపయోగిస్తూ నిజమైన దేశ భక్తిని చాటుకుంటున్నారు. ఇలా తోషాఖానా ద్వారా పాకిస్థాన్ ప్రధానులు ఎంత మొత్తాన్ని వెనక వేసుకున్నారు.? దీనికి భిన్నంగా మన ప్రధాని ఆ బహుమతులను ఏం చేశారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆసిఫ్ అలీ జర్దారీ..
26 జనవరి 2009న, అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడికి తెల్లటి BMW 760 LI (బుల్లెట్ ప్రూఫ్) కారును బహుమతిగా ఇచ్చారు. కారు ధర రూ. 2.73 కోట్లు అయితే జర్దారీ తోషాఖానాకు కేవలం రూ.40 లక్షలు చెల్లించి కారును తన ఆధీనంలో ఉంచుకున్నారు. 2011 మార్చిలో రూ.10 లక్షల విలువైన వాచ్‌తోపాటు మరికొన్ని వస్తువులను కేవలం రూ.1,58,250కే సొంతం చేసుకున్నారు. అదే ఏడాది జూన్‌లో రూ.12.5 లక్షల విలువైన మరో వాచ్‌ను కేవలం రూ. 1,89,219తో సొంతం చేసుకున్నాడు. అక్టోబర్‌లో రూ.10 లక్షల విలువైన కార్టియర్ వాచ్‌ను రూ.3,21,000కే సొంత చేసుకున్నాడు.
నవాజ్ షరీఫ్..
ఇక మరో పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు 20 ఏప్రిల్ 2008న మెర్సిడెస్ బెంజ్ కారును బహుమతిగా ఇచ్చారు. దీని ధర 42.5 లక్షల రూపాయలు. అధికారిక పత్రాల ప్రకారం కేవలం 6 లక్షల 36 వేల రూపాయలతో కారును సొంతం చేసుకున్నారు.
ఇమ్రాన్ ఖాన్..
పాక్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ విషయానికి వస్తే.. ఆయన అత్యంత ఖరీదైన ఐదు రిస్ట్ వాచీలు విదేశీ పర్యటనల సందర్భంగా స్వీకరించారు. వాటిలో గ్రాఫ్ వాచీ ఒకటి. దీనికి విలువ 3.8 మిలియన్ డాలర్లు, ఇవన్నీ అక్టోబర్ 2018లో దక్కించుకున్నారు. ఇంత ఖరీదు చేసే విలువైన వాచీలకు ఖాన్‌సాబ్ చెల్లించింది మాత్రం కేవలం రూ. 7.54 లక్షలు. అదే ఏడాది సెప్టెంబర్‌లో 8.5 కోట్ల రూపాయల విలువైన వాచ్, 56 లక్షల రూపాయల విలువైన కఫ్లింక్లు, 15 లక్షల రూపాయల పెన్ను, 87.5 లక్షల రూపాయల విలువైన ఉంగరాన్ని తోషాఖానాలో కేవలం రూ. 2 కోట్లు చెల్లించారు.
అనంతరం మరో 15 లక్షల రూపాయల విలువైన రోలెక్స్ వాచ్‌ను బహుమతిగా రాగా తోషాఖాను కేవలం రూ. 2,94,000 చెల్లించారు. ఇక 2019 అక్టోబర్‌లో రూ. 19 లక్షల విలువైన మరో వాచ్‌ని బహుమతిగా అందుకున్నారు ఇమ్రాన్.. ఇందుకుగాను ఆయన తోషాఖానాకు రూ. 9,35,000 మాత్రమే చెల్లించారు. సెప్టెంబర్ 2020లో, ఇమ్రాన్ రూ. 44 లక్షల విలువైన రోలెక్స్ వాచ్‌ను రూ. 24 లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నారు. అదే నెలలో అతని భార్య బుష్రా బీబీకి కోటి రూపాయల నెక్లెస్, రూ.24 లక్షల విలువైన బ్రాస్లెట్, రూ.28 లక్షల విలువైన ఉంగరం, రూ.18.5 లక్షల విలువైన చెవిపోగులు వచ్చాయి. 90 లక్షలతో ఆ కానుకలనూ తన వద్దే ఉంచుకున్నారు.
కానీ నరేంద్ర మోదీ దీనికి పూర్తిగా భిన్నం..
పాకిస్థాన్ ప్రధానులు దేశ ఆర్థిక పరిస్థితి ఏమైపోతే మాకేంటి అన్నట్లు దోపిడికీ దిగితే భారత ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. 2014లో నరేంద్ర మోదీ ప్రధానిగా పదవి స్వీకరటించిన తర్వాత గత 9 ఏళ్లలో విదేశీ అతిథుల నుంచి తక్కువ బహుమతులు అందుకున్నారు. అయితే అందులో ఏదీ తన వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించుకోలేదు. తనకు వచ్చిన బహుమతులన్నింటినీ వేలం వేశారు. దీని ద్వారా వచ్చిన డబ్బును ‘నమామి గంగే’ ప్రాజెక్ట్ ద్వారా గంగానదిని పునరుద్ధరించడం వంటి అనేక దాతృత్వ పనుల కోసం ఉపయోగించారు. కానుకలను వేలం వేయడం ద్వారా ప్రధాని మోదీ ఇప్పటివరకు 100 కోట్ల రూపాయలకు పైగా విరాళంగా ఇచ్చారు. ప్రధానమంత్రి తన వైద్య ఖర్చులు కూడా స్వయంగా భరిస్తారు. చివరికి భోజనానికి కూడా ప్రభుత్వ ఖజానాను ఉపయోగించుకోరు.
నరేంద్ర మోదీకి ఈ వ్యక్తిత్వం ప్రధాని కాకముందు నుంచే ఉంది. 2004లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చిన కానుకలను ఆడపిల్లల చదువుల కోసం వినియోగించారు. 2001లో గుజరాత్ తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు మొత్తం రూ. 19 కోట్ల బహుమతులు వచ్చాయి. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. కానీ మన పొరుగు దేశం పాకిస్థాన్ ప్రపంచ దేశాల ముందు ఎందుకు భిక్షాటన చేస్తుందో ఇరు దేశాల ప్రధానుల మధ్య ఉన్న ఈ వ్యత్యాసాన్ని బట్టి అర్థమవుతోంది.