ఎన్టీఆర్‌పై టీడీపీ కొత్త ప్రచారం ఇది – ఏం చెప్పాలనుకుంటున్నారు?

ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు ఎన్టీఆర్ హాజరు కాలేదు. కల్యాణ్ రామ్ కూడా హాజరు కాలేదు. అయితే ఈ వివాదాన్ని టీడీపీ అంతకంతకూ పెంచాలనుకుంటోంది. ఆన్ లైన్ లో చేస్తున్న రచ్చ కాకుండా.. బయట కూడా ఎన్టీఆర్ కూడా ఉద్దశపూర్వకంగా రాలేదన్న అభిప్రాయాన్ని బయట కల్పిస్తున్నారు.

ఎన్టీఆర్ ఉద్దేశపూర్వకంగా రాలేదని మీడియాకు చెబుతున్న టీడీ జనార్దన్

`ఎన్టీఆర్ ఉత్స‌వాల కోసం మేం ఆహ్వానించ‌డానికి ప్ర‌య‌త్నిస్తే వారం రోజుల త‌రువాత ఎన్టీఆర్ టైమిచ్చారు. ఉత్స‌వాల‌కు రావాల‌ని రిక్వెస్ట్ చేశాం. ఆ రోజు ఫ్యాన్స్‌ని క‌ల‌వ‌డానికి రాత్రి వ‌ర‌కు ఉంటున్నాను అన్నారు. అయితే ఉంటే ఉండండి కానీ తెల్లారి వెళ్లి పుట్టిన రోజు వేడుక‌లు జ‌రుపుకోండి అని రిక్వెస్ట్ చేశాం. కానీ ఆయ‌న‌కు కుద‌ర‌లేదేమో కాలేదు. 22 కుటుంబాల‌తో ప్ర‌త్యేకంగా పుట్టిన రోజు సెల‌బ్రేష‌న్స్ ప్లాన్ చేసుకున్నాన‌ని అన్నారు. క‌ల్యాణ్ రామ్ ని కూడా త‌ప్పుకుండా రావాల‌ని పిలిచాం. ఆయ‌న కూడా రాలేదు. ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుక‌ల్లో పాల్గొనాల‌నే ఫ్యామిలీతో స‌హా క‌ల్యాణ్ రామ్ కూడా వెళ్లిన‌ట్టున్నారు. అందుకే ఆయ‌న కూడా శ‌త జ‌యంతి ఉత్స‌వాల్లో పాల్గొన‌లేదని టీడీ జనార్దన్ చెబుతున్నారు.

బతిమాలామని చెబుతున్న టీడీపీ నేతలు

పుట్టిన రోజు వేడుక‌లు ఎప్పుడైనా జ‌రుపుకోవ‌చ్చు. కానీ అన్న‌గారి జ‌యంతి వేడుక‌లు ముఖ్యం అని చెప్పాం. కానీ విన‌లేదు. రిక్వెస్ట్ చేసినా ఎన్టీఆర్‌, క‌ల్యాణ్ రామ్ రాలేదు` అని తెలిపారు ఉత్స‌వ‌ క‌మిటీ చైర్మ‌న్ టి.డి. జ‌నార్ధ‌న్‌. అంటే ఎన్టీఆర్, క‌ల్యాణ్ రామ్ ఇద్ద‌రూ కావాల‌నే శ‌త జ‌యంతి వేడుక‌ల్లో పాల్గొన‌లేద‌ని ఆయ‌న మాట‌ల ద్వారా స్ప‌ష్ట‌మ‌వుతోంది. అందుకు కార‌ణం బాల‌కృష్ణ వీరిని ప‌ట్టించుకోక‌పోవ‌డ‌మేన‌ని, అది ఎన్టీఆర్‌ను బాగా హ‌ర్ట్ చేసింద‌ని, ఆ కార‌ణంగానే త‌న‌తో పాటు త‌న్న‌య్య క‌ల్యాణ్ రామ్ కూడా రాలేద‌ని అభిమానుల్లో ఇప్ప‌టికీ చ‌ర్చ జ‌రుగుతూనే ఉంది.

టీడీపీకి ఎన్టీఆర్ దూరమయ్యారా ?

ఆయ‌న‌తో పాటు నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ కూడా హాజ‌రు కాక‌పోవ‌డంతో ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌తో పాటు సాధార‌ణ ప్రేక్ష‌కుల్లోనూ చ‌ర్చ జ‌రుగుతోంది. ఎన్టీఆర్ సిటీలోనే ఉండి శ‌త జ‌యంతి వేడుక‌ల్లో ఎందుఎకు పాల్గొన‌లేదు. ఇండ‌స్ట్రీకి చెందిన రామ్‌చ‌ర‌ణ్‌, వెంక‌టేష్‌, నాగ‌చైత‌న్య‌, సుమంత్ హాజ‌రు కాగా ఎన్టీఆర్‌, క‌ల్యాణ్ రామ్ ఎందుకు రాలేద‌న్న‌ది కొన్ని రోజులుగా అభిమానుల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. దీనిపై ఎన్టీఆర్ శ‌త జ‌యంతి ఉత్స‌వాల క‌మిటీ చైర్మ‌న్ టిడి జ‌నార్థన్ షాకింగ్ కామెంట్స్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఎన్టీఆర్ ఘాట్ వద్ద సీఎం సీఎం నినాదాలు

ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించడానికి ఎన్టీఆర్ వచ్చినప్పుడు.. ఆయన అభిమానులు సీఎం సీఎం అనే నినాదాలు చేశారు. దీంతో రాజకీయంగా ఏదో సంచలనంగా జరగడం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది.