భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ . అయితే ఆ స్థాయి ఎలా వచ్చిందో మర్చిపోని పార్టీ. పార్టీ కోసం నిస్వార్థంగా పని చేసే కార్యకర్తలను ఎప్పటికప్పుడు గుర్తుంచుకోవాలని పార్టీలోని ఓ స్థాయిలో ఉండే నేతలందరికి దిశానిర్దేశం చేస్తుంది. ఏపీ బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ నూతన అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన దగ్గుబాటి పురదేశ్వరి .. మొదటి రోజే… పార్టీ కార్యకర్తలను పలకరించడానికి వెళ్లారు. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్లో ఉంటున్న పార్టీ నేత సత్యరాజ్ ఇంటికి ముఖ్య నేతలు వెళ్లారు. అల్పాహార సమావేశాన్ని వారి ఇంట్లోనే నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలతో కలిసి అనేక అంశాలపై చర్చించారు.
బీజేపీలో పార్టీ అంటే కుటుంబం అనే భావన
పార్టీ అంటే ఓ కుటుంబం అన్న భావన కల్పించేలా ఇలాంటి సమావేశాలు ఉపయోగపడతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమ ఇంటికి పార్టీ ముఖ్య నేతలు రావాలని ఏ పార్టీ నేత అయినా కోరుకుంటారు. శుభకార్యాల సమయంలో వస్తారో రారో తెలియదు.. కానీ.. మామూలు రోజుల్లో అయితే.. పార్టీ కార్యకర్తలను ఇతర పార్టీల నేతలు పెద్దగా పట్టించుకునే సందర్భం ఉండదు.కానీ వాటి కంటే భిన్నమైన పార్టీ బీజేపీ అని.. ఇలాంటి కార్యక్రమాల ద్వారా స్పష్టమవుతుంది. సత్యరాజ్ ఎంతో కాలం నుంచి బీజేపీ పార్టీ కి సేవ చేస్తున్నారు. అందుకే ఆయన ఇంటికి వెళ్లారు.
పార్టీ కోసం నిస్వార్థంగా పని చేసే వారిని గుర్తించే హైకమాండ్
పురందేశ్వరి వెంట..ప్రదాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డితో పాటు మరికొంత మంది నేతలు ఉన్నారు. గతంలో పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను.. సత్యరాజ్..అజిత్ సింగ్ నగర్లో ముందు ఉండి నిర్వహించేవారు. ఒక్క ఏపీలోనే కాకుండా దేశం మొత్తం.. బీజేపీ నేతలు ఇలా కార్యకర్తలకు ఇళ్లకు వెళ్తారు.ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా.. అనకే మంది ఇలా అతి సామాన్యులైన కార్యకర్తల ఇళ్లకు వెళ్లి.. వారికి తామున్నామన్న భ రోసాను ఇస్తారు. ఇదే బీజేపీ పట్ల కార్యకర్తల్లో అకుంఠితమైన విశ్వాసాన్ని పెంపొందస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
విస్తృతంగా పర్యటించనున్న కొత్త అధ్యక్షురాలు
ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన పురందేశ్వరి.. విస్తృతంగా జిల్లాల పర్యటనలు చేసి.. పార్టీ బలోపేతం చేయాలని ఆలోచిస్తున్నారు. పదహారో తేదీన ఏపీ బీజేపీ కీలక సమావేశం జరగబోతోంది. అందులో నిర్ణయాలు తీసుకున్న తర్వా.. ఇలా పార్టీ కార్యకర్తలతో పాటు సామాన్యుల ఇళ్లకూ వెళ్లి బీజేపీ క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసే అవకాశాలు ఉన్నాయి.