వయసుతో పాటూ బరువును తగ్గించే పానీయం ఇది…ఎలా తయారు చేయాలంటే!

బరువు తగ్గేందుకు భారీగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ముఖ్యంగా ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో చ‌క్క‌టి పానీయాన్ని త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల చాలా సులభంగా అధిక బ‌రువు స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

ఇప్పటి తరంలో చాలామంది అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణం. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, నూనెలో వేయించిన ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం, కూర్చుని ప‌ని చేయ‌డం వంటి వివిధ కార‌ణాల చేత మ‌న‌లో చాలా మంది ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. అధిక బ‌రువు స‌మ‌స్య‌ను అస్స‌లు నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు. లేదంటే ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. అందుకే ఈ స‌మ‌స్య నుంచి వీలైనంత త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డాలి. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు రోజూ చేసే ప‌నుల‌తో పాటు ఇప్పుడు చెప్పే పానీయాన్ని కూడా త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. బ‌రువు త‌గ్గించే ఈ పానీయాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి… అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

పానీయం తయారీకి
ఈ పానీయాన్ని త‌యారు చేసుకోవ‌డానికి జీల‌క‌ర్ర‌, అల్లం, నిమ్మ‌ర‌సం రెడీ చేసుకోవాలి. ముందుగా జార్ లో ఒక టేబుల్ స్పూన్ జీల‌క‌ర్ర వేసి మెత్త‌ని పొడిలా చేసుకోవాలి. త‌రువాత ఈ పొడిని ఒక గిన్నెలో వేసుకుని అందులో ఒక ఇంచు అల్లం తురుము, లీట‌ర్ నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత మ‌రో 5 నిమిషాల పాటు మ‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ఈ పానీయాన్ని వ‌డ‌క‌ట్టి అందులో నిమ్మ‌ర‌సాన్ని వేసి క‌ల‌పాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గించే పానీయం త‌యారవుతుంది.

మూడు పూటలా తీసుకోవాలి
ఈ పానీయాన్ని ఆహారం తీసుకోవ‌డానికి అర గంట ముందు 50 ఎమ్ ఎల్ మోతాదులో తీసుకోవాలి. ఇలా మూడు పూట‌లా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా బ‌రువు తగ్గ‌వ‌చ్చు. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఎక్కువ‌గా ఉండే కొలెస్ట్రాల్ తొల‌గిపోతుంది. శ‌రీరంలో ఎక్కువ‌గా ఉండే నీరు బ‌య‌ట‌కు పోతుంది. శ‌రీరంలో మెటబాలిజం రేటు పెరుగుతుంది. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ఇలా జీల‌క‌ర్ర‌తో చ‌క్క‌టి పానీయాన్ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.