బనానా చిప్స్ అంటే తెలియని వారుండరు. కొద్దిగా కొబ్బరి టేస్ట్ ఉండి కరకరలాడుతూ ఉండే ఈ చిప్స్ చాలా మందికి ఇష్టపడతారు. చిప్స్ ఏవైనా కానీ ఆరోగ్యానికి మంచివి కాదనుకుంటారు రానీ బనానా చిప్స్ ఆరోగ్యానికి మంచివని, ఎప్పుడైనా తినొచ్చంటారు. ఈ మాట నిజమేనా…
ఎండబెట్టి వేయించిన బనానా స్లైసెస్ వేయించడానికి ముందు షుగర్ సిరప్, ఉప్పు, ఇంకా ఇతర మసాలా దినుసుల తో కోట్ చేస్తారు. ఆ తర్వాత ఎండబెట్టి వేయిస్తారు. ఈ చిప్స్ ని వేయిస్తారు కాబట్టి వాటిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి ఒక రెగ్యులర్ కప్ బనానా చిప్స్ లో 374 క్యాలరీ కౌంట్
, 1.5 గ్రాముల ప్రోటీన్, ఐదు గ్రాముల ఫైబర్, నలభై గ్రాముల కార్బో హైడ్రేట్స్ , ఇరవై ఐదు గ్రాముల షుగర్, ఇరవై నాలుగు గ్రాముల ఫ్యాట్ ఉంటాయి. మరి ఆరోగ్యానికి మంచివేనా అంటే…ఇందులో ఉండే ఇన్గ్రీడియెంట్స్ ఈ చిప్స్ ని హెల్దీ గానే చేస్తాయి. నీరసంగా అనిపించినప్పుడు , వర్కౌట్స్ తర్వాత తీసుకునేందుకు ఇవి మంచి ఆహారం.
బనానా చిప్స్ లో పొటాషియం, విటమిన్ సి, బీ6 వంటి పోషకాలున్నాయి
అరటి చిప్స్ వేయించడం వల్ల ఫైబర్ సహా కొన్ని పోషకాలు కోల్పోతాయి
నూనెలో వేయించడం వల్ల కొవ్వు, కేలరీలు పెరుగుతాయి
అరటి చిప్స్ లో ఉప్పు చక్కెర వంటి పదార్థాలు ఉపయోగించడం వల్ల పోషకాలు మారొచ్చు
తక్కువ కొవ్వు లేదా కొవ్వు లేని బనానా చిప్స్ ఎంచుకోవడం మంచిది
బనానా చిప్స్ లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
బనానా చిప్స్ కడుపునిండిన భావాన్ని కలిగిస్తాయి
అయితే రుచిగా ఉన్నాయని అతిగా తింటే అనారోగ్యం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అరటి చిప్స్ ఎప్పుడూ అరటి పండు కి సబ్స్టిట్యూట్ కాదు. చిప్స్ కంటే పళ్లే ఆరోగ్యకరం. అయితే రెగ్యురల్ గా తినే పొటాటో చిప్స్ కన్నా బనానా చిప్స్ ఆరోగ్యానికి మంచివి
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.