కర్పూరం యాంటీ బాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. కర్పూరాన్ని పేస్ట్ చేయడం ద్వారా శరీరంలోని అనేక సమస్యలను తొలగించడానికి ఉపయోగించవచ్చు. నొప్పి, మంట, దురద నుంచి ఉపశమనానికి దీనిని వాడవచ్చు. అంతే కాకుండా కర్పూరం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి.
ఆర్థరైటిస్ నొప్పి నుంచి ఉపశమనం
ఆర్థరైటిస్ నొప్పి ,వాపు నుండి ఉపశమనం పొందేందుకు కర్పూరం ఉపయోగపడుతుంది. కర్పూరంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయని, ఇది నొప్పిని తగ్గించడం ద్వారా న్యూరల్జియాను నయం చేస్తుంది. కర్పూరాన్ని ఉడికించి ఈ నూనెను నొప్పి ఉన్న చోట రాయవచ్చు.
స్కాల్ప్ దురద తగ్గుతుంది
తలలో తీవ్రమైన దురద తగ్గించేందుకు చక్కని పరిష్కారం కర్పూరం. కర్పూరం యాంటీ బాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు చండ్రును నివారిస్తాయి, దురదను తగ్గిస్తాయి. దీన్ని కొబ్బరినూనెలో వేసి మరిగింది అప్లై చేయాలి.
శరీరంపై దద్దుర్లు
ముఖంపైనే కాదు శరీరంపై కూడా కొన్ని దద్దుర్లు ఇబ్బందిపెడుతుంటాయి. కర్పూరం లవంగం నూనె వాటిని వదిలించుకోవడానికి ఉత్తమమైన ఔషధం. దద్దుర్లు, బొబ్బలు మాత్రమే కాదు మచ్చలు కూడా దీనివల్ల నయమవుతాయి.
పాదాలలో ఫంగల్ ఇన్ఫెక్షన్
కర్పూరంలో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు పాదాలకు వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్ను నయం చేస్తాయి. ఇందుకోసం కర్పూరాన్ని నీళ్లలో వేసి మరిగించి పాదాలను ఆ నీటిలో ఉంచాలి. రాత్రి నిద్రపోయే ముందుకూడా కర్పూరం, లవంగం నూనె రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల దురద తగ్గడంతో పాటు ఫంగల్ ఇన్ఫెక్షన్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది
కర్పూర నూనె రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. వాపులు తగ్గిస్తుంది. మొటిమలు, జిడ్డు చర్మానికి మంచి పరిష్కారం. కీళ్ల నొప్పులు ఉన్న వారు కర్పూర మిశ్రమాన్ని లేపనంగా రాసుకుంటే ఉపశమనం దొరుకుతుంది. కఫం కారణంగా ఛాతి పట్టేసినట్టు ఉంటే కర్పూర నూనె రాస్తే ఉపశమనం కలుగుతుంది. తలనొప్పికి శొంఠి, తెల్లచందనంతో కర్పూరం కలిపి చేసిన లేపనపు కట్టు మంచి పరిష్కారం. కర్పూరం వేడినీటిలో వేసుకుని ఆవిరి పట్టడం వల్ల జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. తీవ్రమైన దగ్గుకు ఆవ నూనె లేదా నువ్వుల నూనెలో కలిపిన కర్పూరంతో మర్ధనా చేస్తే త్వరగా తగ్గుతుంది.
రూమ్ ప్రెషనర్
కర్పూరాన్ని మెత్తగా పొడి చేసి లావెండర్ నూనెలో కలిపి స్ప్రే బాటిల్ లో వేసి స్ప్రే చేస్తే ఇల్లు సువాసనతో ఘుమఘుమ లాడుతుంది. మంచి ఎయిర్ ఫ్రెషనర్‌గా పనిచేస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం…