చిన్న పని చేసినా నాలుగు అడుగులు వేసినా అలసిపోతున్నారా? కాసేపు కూర్చున్నా కాళ్లు, చేతులు తిమ్మిర్లు వస్తున్నాయా? అయితే మీరు ఆలోచించాల్సిందే.
సగం రోగాలకు కారణం ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు. వివిధ హార్మోన్లు, విటమిన్ డి, శరీరంలో ఆరోగ్యకరమైన కణజాలాలకు కొలెస్ట్రాల్ అవసరం. కానీ అవసరానికి మించి ఉంటే తీవ్రమైయా అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. అధిక కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోతే చాలా ప్రమాదం. కొలెస్ట్రాల్ నీటిలో కరగదు అందుకే శరీరంలోనూ స్వతంత్రంగాను కదలదు. అయితే నివారణ మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. సరైనా ఆహారం, సరిపడా వ్యాయామం, అవసరమైన మందులు వినియోగించడం ద్వారా అధిక కొవ్వును కరిగించేసుకోవచ్చు. అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు తరచుగా కనిపించవు కానీ నిర్లక్ష్యం చేస్తేమాత్రం పరిస్థితి చేయిదాటిపోతుంది. దీనివల్ల గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అధిక కొవ్వు చేరిందని చెప్పే సంకేతాలు, దానివల్ల వచ్చే సమస్యలేంటో చూద్దాం.
తిమ్మిరి
అధిక కొలెస్ట్రాల్ వల్ల నరాలు ప్రభావితమవుతాయి. ఫలితంగా చేతులు, కాళ్ళలో జలదరింపు, తిమ్మిరిగా అనిపిస్తుంది. కొలెస్ట్రాల్ ఏర్పడటం వల్ల రక్తప్రసరణ సరిగా జరగక ఇలాంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. అప్పుడప్పుడు తిమ్మిర్లు పడితే పర్వాలేదు కానీ తరుచూ కాసేపు కూర్చున్నా కాళ్లకు తిమ్మిర్లు వస్తున్నాయంటే ఆలోచించాల్సిందే
శ్వాస ఆడకపోవడం
అధిక కొలెస్ట్రాల్ తో సహా అనేక గుండె సంబంధిత సమస్యలకు శ్వాస ఆడకపోవడం ఒక విలక్షణమైన సంకేతం. ధమనుల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయినప్పుడు గుండెకు రక్త ప్రసరణ తగ్గడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. అందుకే శ్వాశ ఆడకపోతే అందుకు కారణం అధిక కొవ్వు కావొచ్చు లేదంటే గుండె సంబంధిత సమస్యలు కావొచ్చు
ఛాతీ నొప్పి
ఛాతీలో అసౌకర్యంగా అనిపిస్తుంది. దీన్ని ఆంజీనా అని కూడా పిలుస్తారు. కరొనరీ ఆర్టరీ వ్యాధి ఉన్న వారిలో అధిక కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ధమనుల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల అడ్డంకులు ఏర్పడతాయి. ఇది అనారోగ్యానికి కారణమవుతుంది.
అలసట
నాలుగు అడుగువేసినా అలసిపోతుంటారు కొందరు. అలా అయితే అది కచ్చితంగా అధిక కొలెస్ట్రాలే. వారి రక్తంలో ఎక్కువగా ఉండే కొలెస్ట్రాల్ కండరాలకు రక్త సరఫరాను తగ్గిస్తుంది. ఫలితంగా తీవ్ర అలసటకు దారి తీస్తుంది.
అధిక రక్తపోటు – చూపు మందగింపు
అధికంగా కొవ్వుచేరితే రక్తపటు పెరిగిపోతుంది. ధమనుల్లో కొలెస్ట్రాల్ చేరడం వల్ల రక్తనాళాల నిరోధకత పెరుగుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే కళ్ళకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడతాయి. దీని వల్ల చూపు మందగిస్తుంది. దృష్టి లోపం సమస్యలు ఎదురవుతాయి.
వీటితో పాటూ రాత్రిపూట పడుకునే సమయంలో పాదాలు, కాళ్ళలో మంట లేదా నొప్పి వస్తుంది. చర్మం రంగులో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. కాలి పుండ్లు, పాదాల పుండ్లు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటివి ఏ లక్షణాలు కనిపించినా కూడా శరీరంలో అధిక కొలెస్ట్రాల్ ఉందని అర్థం. దీన్ని అదుపులో ఉంచుకోవడం కోసం మంచి ఆహారం సరైన మార్గం. ఇవి డైట్లో చేర్చుకుంటే కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచుకోవచ్చు. సిట్రస్
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం…