థైరాయిడ్ నుంచి బయటపడాలంటే అస్సలు తినకూడనివి ఇవే!

థైరాయిడ్ గ్రంథి పనితీరు సక్రమంగా లేకపోతే దాని ప్రభావం శరీరమంతా పడుతుంది. దీర్ఘకాలిక ఒత్తిడి, జీర్ణక్రియలో సమస్యలు, హార్మోన్ల అసమతుల్యతతో పాటు ఇతర కారణాలు హైపో థైరాయిడ్ కి దారి తీస్తుంది. మెడ భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. జీర్ణక్రియ, జీవక్రియ, నిద్ర, ఎనర్జీ లేవల్స్, రుతుచక్రం సక్రమంగా పని చేసేందుకు ఈ గ్రంథి ఉపయోగపడుతుంది. అందుకే థైరాయిడ్ గ్రంథి పని తీరు బాగుండాలంటే జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి.

ఏం తినాలి – ఏం తినకూడదు
నిత్యం ఏం తింటున్నాం..అవి శరీరానికి ఎంతవరకూ అందుతున్నాయన్న విషయం గమనించాలి. జీవక్రియకు సహాయపడే జీర్ణక్రియను నియంత్రించే కాలానుగుణమైన పండ్లు, కూరగాయలు తప్పని సరిగా తీసుకోవాలి. ఇప్పటికే థైరాయిడ్ ఉండేవారు ిసోయా ఆధారిత ఉత్పత్తులు, క్యాబేజ్, నిల్వ ఉంచిన మాంసం వంటి పదార్థాలని తీసుకోకపోవడమే మంచిది. ఒమేగా ఫ్యాటీ 3 ఆమ్లాలు ఎక్కువగా ఉండే చేప, గుడ్లు వంటి ఆహారాన్ని మీ డైట్లో భాగం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

బరువు తగ్గించాలి
హైపో థైరాయిడ్ తో బాధపడే వాళ్ళు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ బరువును తగ్గించుకోవాలి. ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. గర్భిణులకు థైరాయిడ్ సమస్య ఉంటే చనుబాలు తగ్గుతాయని పిల్లలకి సరిపడినంత పాలు రాకుండా చేస్తుందని అంటారు.

మద్యం, కాఫీకి దూరం
థైరాయిడ్ గ్రంథి పని తీరు సరిగా ఉండాలంటే మద్యపానానికి, కాఫీకి దూరంగా ఉండాలి. ఇవి తాగే అలవాటు ఉంటే వాటికి దూరంగా ఉండటం మంచిది.

గ్లూటెన్ ఫ్రీ ఫుడ్
గోధుమలు, బార్లీ వంటి ఆహార పదార్థాల వల్ల థైరాయిడ్ గ్రంథి వాపుని పెంచుతుంది. దీని వల్ల ఇతర అనారోగ్య సమస్యలు మనల్ని ఇబ్బంది పెడతాయి. అందుకే గ్లూటెన్ తక్కువగా ఉన్న ఆహార పదార్థాలను ఎంచుకోవాలి.

ధ్యానం చేయాలి
బరువును అదుపులో ఉంచేందుకు, ఒత్తిడిని దూరం చేసేందుకు మన జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. మీ శరీరాన్ని, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి రోజుకి కనీసం 30 నిమిషాల పాటు ధ్యానం లేదా యోగా చెయ్యడం అలవాటు చేసుకోవాలి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.