2024 ఎన్నికల్లో గెలిచిన సినీ సెలబ్రెటీలు వీళ్లే – ప్రతి ఒక్కరి విజయం ప్రత్యేకమే!

గతంలో ఎన్నడూ లేనతంగా దేశ చరిత్రలో 2014 ఎన్నికలు హాట్ టాపిక్ అయ్యాయి. ముఖ్యంగా ఈ సారి ఎన్నికల్లో సినీ సెలెబ్రెటీలు చాలామంది టాప్ కంటిస్టెంట్స్ గా పోటీచేశారు. చాలా మంది ఫస్ట్ టైమ్ అదృష్టం పరీక్షించుకోగా..మరికొందరు గతంలో ఓడి ఈసారి గెలుపుగుర్రాలెక్కారు.. ఇంకొందరు గతంలో ఓ వెలుగువెలిగి ఇప్పుడు తుస్సుమన్నారు… ఈ జాబితాలో ఎవరున్నారో చూద్దాం…

టాలీవుడ్ హీరోలు గట్టిగానే కొట్టారు
ఈ సారి ఎన్నికల్లో పోటీకి దిగిన సినీ సెలెబ్రెటీల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకోవాలి. గత ఎన్నికల్లో పోటీచేసిన రెండు స్థానాల్లో ఓటమిపాలైనా కానీ ఎక్కడా ఆత్మ విశ్వాసం కోల్పోకుండా ఈసారి బ‌రిలోకి దిగారు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్ర‌త్య‌ర్ధిపై భారీ మెజారిటీతో విజయం సాధించి..కూటమిలో కీలకంగా మారారు. ఇక నందమూరి న‌ట‌సింహ బాల‌కృష్ణ వరుసగా మూడోసారి హిందూపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి హ్యాట్రిక్ అందుకున్నారు.

ఇతర భాషల నటులు దూసుకెళ్లారు
మలయాళ నటుడు సురేష్ గోపీ కేర‌ళ‌లో స‌రికొత్త చ‌రిత్రే రాసారు. దేశంలోనే మొట్ట మొద‌టి సారిగా కేర‌ళ రాష్ట్రం నుంచి బీజేపీ (BJP) అభ్య‌ర్థిగా పార్ట‌మెంట్‌లో అడుగు పెట్ట‌బోతున్న వ్య‌క్తిగా రికార్డులోకెక్కాడు. శ్రీశూరు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ ఘన విజయం సాధించారు. భోజ్ పురీ నటుడు రవికిషన్ కూడా గోరఖ్‌పూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి BJP అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. మనోజ్ తివారీ కూడా ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గం నుంచి BJP తరపున నిలిచి గెలిచారు. రామాయ‌ణం సీరియ‌ల్ లో రాముడి పాత్ర‌తో ఫేమ‌స్ అయిన అరుణ్ గోవిల్ బీజేపీ అభ్య‌ర్ధిగా మీర‌ట్ యోజకవర్గం నుంచి గెలిచారు. బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడుశత్రుజ్ఞ సిన్హా పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్ నియోజకవర్గం నుంచి టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఇదే పార్టీ నుంచి తెలుగు సినిమాల్లో న‌టించిన ర‌చ‌నా బెర్జీ హుగ్లీ స్థానం విజయం సాధించారు.

నటీమణులు తగ్గేదేలే
సీనియ‌ర్ న‌టి హేమ మాలిని మధుర నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా మరోసారి భారీ మెజార్టీతో గెలిచారు. బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ తొలిసారి బీజేపీ నుంచి హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని మండి నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో ఎంపీగా గెలిచారు. కంగనా విజయంపై మొదట్లో అందరూ సందేహం వ్యక్తం చేశారు కానీ క్వీన్ మాత్రం మొదట్నుంచీ ధీమానానే ఉంది….విజయం సాధించింది.

ఓడినవాళ్లు వీళ్లే
క‌న్న‌డ స్టార్ శివ‌రాజ్ కుమార్ భార్య నిర్మాత గీతా శివరాజ్ కుమార్ షిమోగా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ త‌రుపున పోటీ చేసి ఓడిపోయారు. ఆమె త‌రుపున శివ‌న్న పెద్ద ఎత్తు ప్ర‌చారం చేసినా ఫలితం లేకపోయింది. ఆంధ్రప్రదేశ్ నగరి నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన రోజా కూడా ఓటమి పాలయ్యారు. అలాగే మరో న‌టి నవనీత్ కౌర్ కూడా ఓడిపాలయ్యారు.