దీపారాధనకు హిందువులు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. శ్రద్ధగా చేసిన పూజ, భక్తితో సమర్పించిన ఫలం ఎప్పుడూ మంచే చేస్తుందంటారు. అయితే భక్తితో పాటూ విధానం కూడా ప్రధానం అంటారు పెద్దలు.
“దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపం సర్వ తమోపహమ్
దీపేన సాధ్యతే సర్వం దీప లక్ష్మీ ర్నమోస్తుతే”
దీపం ప్రాణానికి ప్రతీక. జీవాత్మకే కాదు పరమాత్మకి ప్రతిరూపం. అందుకే పూజ చేసే ముందుగా దీపం వెలిగిస్తారు. దేవుడిని ఆరాధించటాని ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధిస్తామన్నమాట. షోడశోపచారాల్లో ఇది ప్రధానమైనది. అన్ని ఉపచారాలు చేయలేక పోయినా ధూపం- దీపం- నైవేద్యం తప్పనిసరిగా ఫాలో అయ్యే ఉపచారాలు.
దీపారాధన పద్ధతులు
దీపారాధన చేసేముందు వత్తి వేసి తర్వాత నూనె పోస్తుంటారు కానీ ఇది పద్ధతి కాదు. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసి తర్వాత వత్తులు వేయాలి.
వెండి కుందులు, పంచ లోహ కుందులు, ఇత్తడి కుందులు మంచివి. స్టీలు కుందుల్లో దీపారాధన చేయకూడదు. కుందులను రోజూ శుభ్రంగా కడిగిన తర్వాతే ఉయోగించాలి. ఏ ప్రమిదలో దీపారాధన చేసినా, ఆ ప్రమిద కింద చిన్న పళ్లాన్ని లేదా ఆకుని ఉంచాలి.
-మూడు వత్తులతో దీపారాధన చేయడం వలన సంతాన లాభం కలుగుతుంది
-అయిదు వత్తులతో దీపారాధన చేయడం వలన సంపదలు చేకూరతాయి
-తొమ్మిది వత్తులతో దీపారాధన చేయడం వలన కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి
-మట్టి ప్రమిదలో దీపారాధన చేసినా పర్వాలేదు కానీ స్టీలు కుందుల్లో దీపారాధన చేయరాదు
-కొందరు నేరుగా అగ్గిపుల్లతో దీపం వెలిగిస్తారు అలా చేయకూడదు. ఏకహారతితో కానీ, అగరుబత్తితో కానీ దీపం వెలిగించాలి
-ఒకవత్తితో దీపం పెట్టకూడదు.
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహమ్
భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే
త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్య ర్జ్యోతి ర్నమోస్తుతే”
“మూడు వత్తులు, నూనెలో తడిపి, అగ్నితో వెలిగించి మూడు లోకాల చీకట్లను పోగొట్ట గలిగిన దీపాన్ని వెలిగించాను. పరమాత్మునికి ఈ దీపాన్ని భక్తితో సమర్పిస్తున్నాను. భయంకరమైన నరకాన్నుంచి రక్షించే దివ్య జ్యోతికి నమస్కరిస్తున్నాను.” అని అర్థం. ఇక మూడు వత్తులు (త్రివర్తి) ముల్లోకాలకి, సత్త్వ, రజ, తమో గుణాలకి, త్రికాలాలకి సంకేతం. ఏకవత్తి కేవలం శవం వద్ద వెలిగిస్తాం.
ఏ వైపు దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి ప్రయోజనం
-దేవుడికి ఎదురుగా దీపాన్ని ఉంచరాదు.
-తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహదోషాలు, కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు
-పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది.
-ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే సిరిసంపదలు, విద్య, వివాహం సిద్ధిస్తాయి.
-దక్షిణంవైపు దీపారాధన చేయరాదు. దక్షిణముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు, కష్టాలు, దుఖం, బాధ కలుగుతాయి
-దీపం దేవునికి ఎదురుగా కుడిపక్కకు అంటే మన కుడిపక్కకు లేదా దేవుని మంటపంలో ఆగ్నేయ భాగంలో పెట్టాలి
-దీపపు సెమ్మలో మధ్యలో వత్తి పైకి చూసే విధంగా ఉంటే దిక్కులతో ఎలాంటి ఇబ్బంది ఉండదు.
-తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే ఈతిబాధలు, గ్రహ బాధలు, ధు:ఖాలు తొలగిపోతాయి
-పడమటి వైపు ముఖందీపం వెలిగిస్తే ఋణ బాధలు తొలగిపోతాయి, శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది
-ఉత్తర ముఖంగా దీపం వెలిగిస్తే సరిసంపదలు కలుగుతాయి. విద్యకు, వివాహానికి అటంకాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి.
-దక్షిణముఖంగా దీపారాధన చేస్తే అపశకునాలు ఎదురై, దు:ఖబాధలు కలుగుతాయి.
నాలుగు పక్కలా నాలుగు దీపాలు పెడితే మరీ శ్రేష్ఠం
ఎన్ని వత్తులు వేయాలి
దీపారాధనకు ఏ నూనె వినియోగించాలి
దీపం వెలిగించడానికి ఏ నూనె వాడాలనే విషయంపై చాలామంది అయోమయానికి గురవుతుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వేరుశనగ నూనెతో దీపారాధన చేయరాదు. దీపారాధనకు ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది. లేదంటే నువ్వుల నూనె వాడినా శ్రేష్టమే. దీపం వెలిగించడానికి ఆముదం ఉపయోగిస్తే దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగుతుంది. విప్ప, వేప నూనెలు, ఆవు నెయ్యి వాడటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. నల్ల నువ్వుల నూనెతో శనీశ్వరునికి దీపారాధన శుభం అని పండితులు చెబుతారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం కొన్ని పుస్తకాలు, పండితుల నుంచి సేకరించినది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.