ఇల్లు చిన్నదైనా, పెద్దద్దైనా ప్రతి హిందువుల ఇంట్లో పూజ మందిరం ఉంటుంది. ఇంటికి ఈశాన్య దిశలో దైవ ప్రార్థనకు అనుకూలం. అయితే పూజ గది కోసం ఏ ప్రదేశాన్ని నిర్ణయించుకున్నా గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని వస్తువులను పూజ గదిలో మాత్రమే కాదు…ఆ సమీపంలో కూడా ఉంచకూడదని చెబుతారు వాస్తు పండితులు.
పెద్ద విగ్రహాలు
ఇంట్లో పూజ మందిరంలో ఎప్పుడూ పెద్ద పెద్ద విగ్రహాలు ఉండకూడదు. విగ్రహం సైజ్ పెరిగేకొద్దీ నిత్యం జరిగే పూజలు, నివేదనలు కూడా అంతే భారీగా ఉండాలి. లేదంటే ఇంట్లో అనుకూల ఫలితాలకన్నా ప్రతికూల ఫలితాలే ఎక్కువగా ఉంటాయి. చాలామంది ఇంట్లో శివలింగం పెట్టుకుంటారు. దాని పరిమాణం కూడా బొటన వేలు కన్నా పెద్దదిగా ఉండకూడదు. విరిగిన విగ్రహాన్ని పూజ గదిలో ఉంచకూడదు.
వాడిపోయిన పూలు
దేవుడు దేవతల దగ్గర ఎప్పుడూ వాడిన పూలు ఉండకూడదు. పూజ చేసేటప్పుడు ఫ్రెష్ పూలు పెట్టినా అవి వాడిన వెంటనే తీసేయ్యాలి. కొందరైతే నిత్యం పూలు కొనడం కుదరక ఒకేసారి కొనేసి వాటిని నిల్వచేసుకుని దేవుడికి నిత్యం పూజచేస్తారు. ఇది కూడా సరికాదంటారు పండితులు.
బూట్లు
పూజా గది సమీపంలో పాదరక్షలు పెట్టకూడదనేది ప్రాథమిక నియమాలలో ఒకటి. మీరు స్థలంలో పరిమితమైనప్పటికీ, ఈ పవిత్ర స్థలం దగ్గర షూ రాక్ లేదా షూలను ఉంచవద్దు. అదేవిధంగా పూజ గది దగ్గర చెప్పులు పెట్టకూడదు.
తోలు సంచులు
పూజ గదిలో ఎలాంటి అపవిత్రమైన వస్తువులు పెట్టకూడదని హిందూ పురాణాలు చెబుతున్నాయి, తోలు సంచులు జంతువుల చర్మంతో తయారు చేసిన వస్తువులు దేవుడి మందిరంలో వినియోగించరాదు. తోలుతో చేసిన బ్యాగులు, ఇతర వస్తువులను కూడా ఉంచకూడదు.
చనిపోయిన వారి ఫొటోలు ఉండకూడదు
చాలామంది మరణించిన పూర్వీకుల ఫోటోలను పూజ గదిలో, ఫోటోగ్రాఫ్‌లు లేదా దేవుళ్ల విగ్రహాల దగ్గర ఉంచడానికి ఇష్టపడతారు. వాస్తు శాస్త్రం ప్రకారం దీనికి దూరంగా ఉండాలి. చనిపోయినవారిని ప్రార్థించాలనుకుంటే వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటే పూజ గదిలో ఉంచకూడదు. వారి చిత్రాలను పూజా గదిలో ఉంచడం దురదృష్టాన్ని తెస్తుంది.
గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.