హాఫ్ సెంచరీ కొట్టినా ఇంకా పెళ్లి ఊసెత్తని హీరోయిన్స్ వీళ్లే!

సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్లు, లవ్‌లు, బ్రేకప్‌లు, డివోర్స్‌లు చాలా కామన్ అయిపోయాయి. కొందరైతే వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేసి ప్రశాంతంగా ఒంటరి జీవితం గడిపేస్తుంటే మరికొందరు మరోసారి వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఈ రెండు రకాలకు చెందని మరికొందరు హీరోయిన్స్ మాత్రం అస్సలు పెళ్లి మాటే లేదు. వీళ్లలో కొందరికి 40 దాటిపోగా మరికొందరు 50 లోకి అడుగుపెట్టేసారు కూడా. ఇంతకీ ఆ హీరోయిన్స్ ఎవరో చూద్దాం..

టబు
పెళ్లికాని హీరోయిన్లు అనగానే సినీ ప్రియులు చాలామందికి ముందుగా టబు గుర్తొస్తుంది. అప్పుడెప్పుడో ప్రేమదేశం సినిమాతో యూత్ ని ఊపేసిన ఈమె ఇప్పటికీ పెళ్లిఊసే ఎత్తడం లేదు. వయసు 50 దాటిపోయింది కూడా. అప్పట్లో నాగార్జునతో ప్రేమలో పడిందని అందుకే పెళ్లికి దూరంగా ఉండిపోయిందని టాక్.

శోభన
అభినందన సినిమాలో కుర్రకారుని ఉర్రూతలూగించిన శోభన స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఈమెకున్న ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉండేది. అందమైన శోభన ఇప్పటికీ ఒంటరిగానే ఉండిపోయింది. 50 ఏళ్లు దాటినా పెళ్లిమాటెత్తని ఈ బ్యూటీ ఓ పాపను దత్తత తీసుకుంది.

సితార
అప్పట్లో తమిళ నటుడు మురళితో ప్రేమాయణం నడిపించింది సితార. అయితే ఆయన ప్రేమ విఫలం కావడంతో పెళ్లి చేసుకోలేదు అంటూ తమిళనాట వార్తలున్నాయి. సితార వయసు ఇప్పుడు 50

నగ్మా
అరెబియన్ గుర్రంలా ఉంది అనిపించే నగ్మా కూడా ఇప్పటికీ పెళ్లిఊసే లేదు. అప్పట్లో గంగూలీతో ప్రేమలో మునిగితేలింది. గంగూలీ కూడా నగ్మాను పెళ్లిచేసుకోవాలి అనుకున్నాడు కానీ ఏ కారణాలవల్లనో ఆ ప్రేమ విఫలమైంది. ఆ తర్వాత తమిళ నటుడు శరత్ కుమార్‌తో కూడా ప్రేమ విఫలం కావడంతో పెళ్లికి దూరంగా ఉండిపోయింది నగ్మా. ప్రస్తుతం ఈమె వయసు కూడా నగ్మా. ఈమె వయసు కూడా 50కి దగ్గర్లో ఉంది.

సుస్మితా సేన్
యాభై ఏళ్లకి దగ్గరగా ఉన్న సుస్మితా సేన్ కూడా డేటింగ్ లో మునిగి తేలుతోంది కానీ పెళ్లి ఊసెత్తడం లేదు.తన వయసు కన్నా చిన్నవాళ్లతో ఎంచక్కా కాలం గడిపేసింది. ఆ మధ్య లలిత్ మోదీతో డేటింగ్ చేసిన సుష్మితా తనని పెళ్లిచేసుకుంటుందన్నారు కానీ అది కూడా మూన్నాళ్ల ముచ్చటే అయింది.

కౌసల్య
అల్లుడుగారు వచ్చారు, పంచదార చిలక లాంటి సినిమాలతో తెలుగు ఆడియన్స్‌ను అలరించిన కౌసల్య కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. ఒకప్పుడు హీరోయిన్ గా చేసి, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతోంది. మలయాళ చిత్ర పరిశ్రమలో ఆమెను నందిని అని పిలుస్తారు . ఇప్పటికీ పెళ్లి మాటేలేదు.

అనుష్క శెట్టి
అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఎప్పుడు పెళ్లిచేసుకుంటుందో అనే డిస్కషన్ ఎప్పటి నుంచో నడుస్తోంది. ప్రభాస్ తో వరుస సినిమాల్లో నటించింది. యంగ్ రెబర్ స్టార్ తో ప్రేమలో పడిందని తనని పెళ్లిచేసుకోవాలి అనుకుంటోందనే టాక్ ఉంది. నలభై ఏళ్లు దాటిన స్వీటీ ఎప్పుడెప్పుడు పెళ్లి కబురు చెబుతుందా అని వెయిటింగ్ లో ఉన్నారు ఫ్యాన్స్

అమీషా పటేల్, నర్గీస్ ఫక్రీ కూడా ఇంకా పెళ్లి మాటెత్తకుండా ఒంటరి జీవితం గడిపేస్తున్నారు.