రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టులోనూ ఎదురుదెబ్బ తప్పలేదు. రాజకీయ విమర్శలకు … పరువు నష్టం కేసులో కింది కోర్టు విధించిన రెండేళ్ల జైల శిక్షను గుజరాత్ హైకోర్టు కూడా సమర్థించింది. ఇందుకు రాహుల్ గాంధీ వెనుక ఉన్న కేసుల రికార్డును కారణంగా చూపించింది. “రాహుల్ గాంధీపై 10కిపైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దోషిగా తేలిన కేసు తర్వాత కూడా పలు కేసులు దాఖలయ్యాయి. వీర్ సావర్కర్ మనవడు కూడా కేసు వేశారు. ఏదిఏమైనా.. మోదీ ఇంటి పేరు వివాదంలో పడిన శిక్షతో రాహుల్ గాంధీకి అన్యాయం జరిగింది అనడానికి ఏం లేదు! ఈ తీర్పు సరైనదే. సూరత్ కోర్టు ఆదేశాలపై జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు ” అని గుజరాత్ హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో రాహుల్ గాంధీపై పడిన అనర్హతా వేటు కొనసాగుతుంది. అంతే కాదు.. మరో ఎనిమిదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయలేరు.
సుప్రీంకోర్టులో ఊరట కోసం ప్రయత్నం చేయడమే చివరి ఆప్షన్
ఆయనకు ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే ఒకే ఒక్క అవకాశం ఉంది. అక్కడ కూడా రాహుల్ గాంధీ ఈ శిక్షకు అర్హుడే.. ఆయన చేసినంతటి నేరం దేశంలో ఇంకెవరూ చేయలేదని నమ్మితే.. శిక్షను ఖరారు చేస్తారు. ఈ లోపు ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదు. సుప్రీంకోర్టులో ఊరట లభించకపోతే.. జైలుకు పోయి రెండేళ్లు గడపాల్సి ఉంటుంది. పరువు నష్టం కేసులో జైలుకు వెళ్లిన ప్రధాని పదవికి పోటీ పడే నేతగా చరిత్రకెక్కుతారు. రెండేళ్ల పాటు జైల్లో ఉండి. విడుదలైన తర్వాత ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయాడనికి అనర్హులు అవుతారు. శిక్షపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు అంగీకరిస్తుందా లేదా అనే దానిపై పూర్తిగా ఆధారపడి ఉంది.
సుప్రీంకోర్టు విచారణ తర్వాత ఉపఎన్నికపై ఈసీ నర్ణయం
ఎన్నికల కమిషన్ వయనాడు ఉపఎన్నికకు షెడ్యూల్ ప్రకటించాడానికి ఎలాంటి ఆటంకాలు లేవు. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 151A, పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలలో సాధారణ ఖాళీలను ఖాళీ ఏర్పడిన తేదీ నుండి ఆరు నెలల్లోపు ఉప ఎన్నికల ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. మిగిలిన పదవీకాలం ఖాళీకి సంబంధించి సభ్యుడు ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఖచ్చితంగా ఉప ఎన్నిక పెట్టాలి. మార్చి 23న రాహుల్‌పై అనర్హత వేటు వేయడంతో వాయనాడ్ సీటు ఖాళీ అయింది. సెక్షన్ 151A ప్రకారం, 2023 సెప్టెంబర్ 22లోగా అక్కడ ఉపఎన్నిక నిర్వహించాల్సి ఉంది. 17వ లోక్‌సభ పదవీకాలం ముగియడానికి ఏడాది కంటే ఎక్కువ సమయం ముందు ఈ స్థానం ఖాళీ అయింది. ఎన్నికైన ఎంపీకి స్వల్ప కాల వ్యవధి మాత్రమే ఉన్నప్పటికీ, ఉప ఎన్నికను రద్దు చేయడం సాధ్యం కాదు. కాంగ్రెస్ నాయకత్వం నేరుగా సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని నిర్ణయించుకుంది . అందుకే ఆ తర్వాత ఉపఎన్నిక నిర్వహించాలని ఈసీ భావిస్తోంది.
న్యాయపరమైన ఆప్షన్లు ఉన్నందుకే ఆగుతున్న ఈసీ
లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్, ఎస్పీ నేత ఆజం ఖాన్, ఆయన కుమారుడు అబ్దుల్లా ఆజం ఖాన్‌లపై అనర్హత వేటు వేయడంతో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేసేందుకు ఈసీ ఉపఎన్నికలను ప్రకటించింది. జనవరి 2023లో, హత్యాయత్నం కేసులో దోషిగా తేలిన ఫైజల్‌పై అనర్హత వేటు పడిన కొద్ది రోజులకే లక్షద్వీప్ లోక్‌సభ స్థానానికి సీఈసీ రాజీవ్ కుమార్ ఉప ఎన్నికను ప్రకటించారు. అయితే, కేరళ హైకోర్టు ఫైజల్‌కు విధించిన శిక్షను రద్దు చేయడంతో రెండ్రోజుల తర్వాత ఎన్నికల నోటిఫికేషన్‌ను EC ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. వాయనాడ్‌కు ఉపఎన్నికల ప్రక్రియను వెంటనే ప్రారంభించడం కంటే వెయిట్ అండ్ వాచ్ విధానాన్ని EC పాటిస్తోంది. మరో రెండున్నర నెలల్లో సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకోకపోతే వాయనాడ్ ఉప ఎన్నిక ఖచ్చితంగా నిర్వహిస్తారు.