అనంతపురంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతు వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలను మాయమాటలతో మభ్యపెడుతోంది.
ఉద్యోగులను మభ్యపెట్టడానికే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసారు ఉద్యోగులు మీరు అనుకున్నంత అమాయకులు కాదు అంటూ నాలుగేళ్లు మాట్లాడకుండా ఎన్నికల వేళ గ్లోబల్ సమ్మిట్ పెట్టారు, సమ్మిట్‌కు ఒక్క విదేశీ పెట్టుబడిదారుడు రాలేదు.
పాత జీవోలనే ఇప్పుడు కొత్తగా వచ్చినట్లు చెబుతున్నారు, కేంద్ర ప్రభుత్వ రాయితీలను తమ గొప్పగా చెబుతున్నారు, సొంత కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటే ప్రయోజనమేంటి?
కేవలం భూదందా కోసం పరిశ్రమలకు భూములు ఇస్తున్నారు అని వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేసారు.