ఆంధ్రప్రదేశ్ బీజేపీకి అతి పెద్ద సమస్య.. ఏదో ఓ పార్టీకి అనుకూలమనే ముద్ర వేయడం. కొన్నేళ్లుగా బీజేపీపై ప్రాంతీయ పార్టీలు అదే వ్యూహం అవలంభిస్తున్నాయి. అధికారంలో ఉన్న పార్టీతో ఇతర ప్రాంతీయ పార్టీ లింక్ కలిపేసి బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటాయి. ఇప్పుడీ ప్రచారాన్ని పటాపంచలు చేయడంలో కొత్త అధ్యక్షులు మొదటి దశలో విజయవంతమవుతున్నారు. పదవి చేపట్టినప్పటి నుండి ఆమె ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
జోనల్ సమావేశాలు విజయవంతం
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఇప్పటికి రెండు జోనల్ సమావేశాలు పూర్తి చేశారు.రాయలసీమ , కోస్తా జోనల్ సమావేశాలకు అనూహ్యమైన ఆదరణ లభింది. ఇవి పార్టీ అంతర్గత సమావేశాలే అయినప్పటికీ.. గతంలో ఇంత జోష్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం పార్టీ కోసం తెగించికష్టపడాలన్న నమ్మకానికి క్యాడర్ వస్తున్నారు. ఇప్పుడు రాజకీయ పరిస్థితులు మారడం కూడా దీనికి కారణం కావొచ్చు. మొత్తం జోనల్ సమావేశాలు పూర్తయ్యే సరికి.. బీజేపీ మొత్తం యాక్టివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ప్రభుత్వంపై తమ విధానంతో స్పష్టత
వైసీపీ ప్రభుత్వ అరాచకాల్ని అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించే ప్రశ్నే లేదని పురందేశ్వరి తమ మాటలతోనే తేల్చిచెబుతున్నారు. రాజ్యాంగపరంగా కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం సహకారం అందిస్తుందే తప్ప.. రాజకీయంగా వైసీపీకి ఎలాంటి సాయం చేయడం లేదని వివరించి చెబుతున్నారు. ఇది ప్రజల్లోకి వెళ్తోంది. ఇప్పటి వరకూ వైసీపీకి బీజేపీ సహకారం ఇస్తోందన్న ప్రచారం అంతా అవాస్తవమని.. రాజకీయ కుట్ర పూరితంగా చేస్తున్నారన్ న నిజాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
కార్యకలాపాలు మరింత విస్తృతం చేయనున్న ఏపీ బీజేప
జోనల్ సమావేశాల తరవాత ఏపీ బీజేపీలో కీలక మార్పులు జరగనున్నాయి. ఆ తర్వాత పార్టీ పొత్తులతో సంబంధం లేకుండా.. ప్రజల్లోకి వెళ్లడానికి పూర్తి స్థాయిలో కార్యాచరణ ఖరారు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో కేంద్ర వ్యూహకర్తలు ఏపీపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.