ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల ఆస్తుల విలువను పెంచేందుకు ఏ మాత్రం ప్రయత్నం చేయకపోగా.. ఆ ఆస్తుల నుంచి విపరీతంగా పన్నులు పిండుకునేందుకు ప్రయత్నిస్తున్న వైనంపై ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఆస్తుల విలువ పెరగడం లేదు సరికదా తగ్గిపోతోందని ఆంధ్రా జనం ఆవేదన చెందుతున్నారని.. కానీ ప్రభుత్వం మాత్రం ప్రభుత్వం మాత్రం మార్కెట్ వాల్యూ , రిజిస్ట్రేషన్ చార్జీలు మాత్రం పెంచుకుంటూ పోతోందని విమర్శించారు.
జూన్ 1 నుంచి ఆస్తుల విలువ పెంంచిన జగన్ ప్రభుత్వం
ఆస్తుల విలువను ఏడాది అర్బన్ పరిధిలో పది నుంచి పదిహేను శాతం ఆస్తుల విలువ పెంచగా.. ఈ ఏడాది రూరల్ పరిధిలో కూడా రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఒకసారి ప్రభుత్వం మార్కెట్ ధరలు పెంచింది. జిల్లా కేంద్రాలతో పాటు డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రేట్లు పెంపు చేసింది. తాజాగా మరోసారి భూముల ధరలు పెంపునకు రెడీ అయింది. అయితే గతంలో ఎక్కడెక్కడ ధరలు పెంచలేదో ఆయా ప్రాంతాల్లో మాత్రమే భూముల విలువలు పెరగనున్నాయి. అందులోనూ డిమాండ్ ఎక్కువగా ఉన్న చోటే ధరలు పెంచబోతోంది. భూముల రేట్ల పెంపు ఒక్కో జిల్లాలో, ఒక్కో ప్రాంతంలో వేర్వేరుగా ఉండనుంది. ఆయా ప్రాంతాల్లో అధికారుల నుంచి తీసుకున్న సమాచారం మేరకు జిల్లాల జాయింట్ కలెక్టర్లు కొత్త ధరల జాబితా సిద్ధం చేశారు. కనీసం 30నుంచి గరిష్ఠంగా 70 శాతం వరకూ ధరలు పెంచుతున్నారు.
కొత్త జిల్లాల పేరుతో గత ఏడాదే పెంపు
వాస్తవానికి గత ఏడాది జిల్లాల విభజన, భూముల ధరలు పెరుగుదలతో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా పెరిగింది. దీంతో ఆదాయాన్ని మరింత పెంచుకునేలా గతంలో పెంచని, డిమాండ్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో ధరలు పెంపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చాక భూమల మార్కెట్ విలును మూడు సార్లు పెంచారు. 2020లో పెంచారు.. కొత్త జిల్లాలు చేశామని 2022లో పెంచారు.. మళ్లీ ఇప్పుడు పెంచుతున్నారు . మార్కె్ట్ విలువను పెంచడం ద్వారా.. రిజిస్ట్రేషన్ చార్జీలు పెరిగిపోతాయి. దీని వల్ల ప్రజలు లావాదేవీలు చేయడం మానేస్తారు.
ఏపీలో తగ్గిపోతున్న ఆస్తుల విలువ
నిజానికి ఐదేళ్ల కిందట ఉన్న మార్కెట్ వాల్యూతో పోలిస్తే.. ప్రస్తుతం ఏపీలో ఆస్తుల విలువ దారుణంగా పడిపోయింది. చాలా చోట్ల ప్రభుత్వం వేసిన విలువ కన్నా మార్కెట్ రేటు కన్నా తక్కువ ఉండటం దౌర్భాగ్యం కాదా అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. చుట్టుముట్టిన కష్టాలను ఆస్తులమ్ముకుని ఆమ్ముకుని అయినా బయటపడేవారిన వదలరా అని మండిపడ్డారు. భూముల విలువ పెంపుతోనే రూ. పదివేల కోట్లకుపైగా అదనపు ఆదాయన్ని పిండుకోవడం ప్రజల్ని దోపిడీ చేయడమేనని.. పరిశ్రమల్ని ఆహ్వానించి.. అభివృద్ధి పనులు చేస్తే ఆటోమేటిక్ గా ఆదాయం పెరుగుతుంది. ఈ పన్నుల బాదుడెందుకని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు.