కొండ నాలికకు మందేస్తే ఉన్న నాలిక ఊడుతోంది ! – హిందూపురంలో వైసీపీ పరిస్థితి ఇదే !

హిందూపురంలో అధికార వైసీపీ పరిస్థితి రాను రాను దిగజారిపోతోంది. నేతల మధ్య వర్గ పోరాటానికి చెక్‌ పెట్టేందుకని ఇటీవలనే నియోజకవర్గ సమన్వయకర్తను మార్చారు. అయినా ఫలితం ఆశించిన మేరకు కనిపించడం లేదు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగానూ ఇవి స్పష్టంగా కనిపించాయి. పంచాయితీతోనైనా పురం వైసిపి రాజకీయం దారికొస్తుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. గ్రూపు రాజకీయాల కారణంగానే వరుసగా ఓడిపోతున్న వైసీపీ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ముందు నుంచి గ్రూపు రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ గ్రూపు రాజకీయాలకు చెక్‌పెట్టేందుకే 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నవీన్‌ నిశ్చల్‌ను కాదని రిటైర్డు అధికారి మహమ్మద్‌ ఇక్బాల్‌ను పోటీలోకి దింపారు. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆ వెంటనే వైసిపి అధిష్టానం ఆయనకు ఎమ్మెల్సీ పదవినిచ్చారు. నియోజకవర్గ సమన్వయకర్తగానూ నియమించారు. అప్పటి నుంచి ఆయన అక్కడే ఉంటూ పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. అయితే స్థానిక నాయకులకు, ఈయనకు మధ్య పొసగలేదు. విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. చౌళూరు రామకృష్ణారెడ్డి హత్య తర్వాత పరిస్థితి తీవ్రం ఈ గ్రూపు తగాదాల్లోనే రామకృష్ణారెడ్డి హత్య జరిగింది. దీంతో విభేదాలు మరింత రచ్చకెక్కాయి. దీనిపై ఇక్బాల్‌పైనే ఆరోపణలు వెళ్లాయి. ఆ తరువాత కూడా అధిష్టానం జోక్యం చేసుకుని సమన్వయం చేసేందుకు ప్రయత్నించింది. అయినా ఫలితం లేకపోవడంతో ఇటీవలనే ఆయన్ను తప్పించారు. దీపికను సమన్వయకర్తగా నియమించారు. ఈమె బిసి సామాజికవర్గానికి చెందినది అయిన్పటికీ భర్త రెడ్డి సామాజికవర్గం. ఈయన ద్వారా పార్టీలో సమన్వయం తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. కాని మార్పు జరిగినా పార్టీ నేతల మధ్య తీరు మారలేదు. మున్సిపల్‌ ఛైర్మన్‌కు తక్కిన వారికి మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. మున్సిపల్ చైర్మన్ భర్తపై కేసులు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సమయంలోనూ మున్సిపల్‌ ఛైర్మన్‌ కాకుండా నియోజకవర్గ సమన్వయకర్త అయిన దీపికనే జెండాను ఎగురవేశారు. దీంతో మరోమారు నేతల మధ్య విభేదాలు పెరిగాయి. ముందు నుంచి స్థానికంగానున్న నవీన్‌ నిశ్చల్‌ తదితరులు కూడా మరో గ్రూపుగా ఉన్నారు. ఈ ముగ్గురి మధ్య విభేదాలున్నాయి. దీనికితోడు స్థానికులు, స్థానికేతుల వివాదం కొనసాగుతోంది. ఇక్కడికి వచ్చే వారందరూ స్థానికేతరులే ఉంటున్నారన్నా ముందు నుంచి అక్కడున్న నేతల్లో అసంతృప్తి ఉంది. ఇప్పుడు వచ్చిన సమన్వయకర్త కూడా ఇదే విధమని భావిస్తున్నారు. ఇలాంటివన్నీ టీడీపీకి కలసి వస్తున్నాయి.