ఆంద్రప్రదేశ్ బీజేపీ నేతలు నెల రోజుల పాటు విస్తృతంగా శ్రమించారు. మోదీ పరిపాలనా విజయాలను ఇంటింటికి తీసుకెళ్లేందుకు మహాజన సంపర్క అభియాన్ ప్రోగ్రాంను విజయవంతం చేసేందుకు శక్తిమేర ప్రయత్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చేస్తున్న సాయాన్ని ప్రజల ముందు ఉంచడంలో విజయవంతం అయ్యారు. కింది స్థాయి కార్యకర్త నుంచి పై ఏపీ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు వరకూ అవిశ్రాంతంగా శ్రమించారు. ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఈ ప్రచార కార్యక్రమం మొత్తం కన్వీనర్ గా వ్యవహరించారు.
రెండు రాష్ట్ర స్థాయి సభలు – ప్రతి జిల్లాలోనూ బహిరంగసభలు
మహాజన సంపర్క అభియాన్ లో భాగంగా రెండు రాష్ట్ర స్థాయి బహిరంగసభల్ని నిర్వహించారు. అమిత్ షా , జేపీ నడ్డా ఈ సభల్లో ప్రసంగించారు. ఈ సభలకు వచ్చిన అనూహ్య ఆదరణతో జిల్లా స్థాయి సభల నిర్వహణలో మరింత దూకుడు ప్రదర్శించారు. ప్రతి జిల్లాలోనూ అగ్రనేతలంతా సభలకు హాజరయ్యారు. స్వచ్చందంగా తరలి వచ్చిన ప్రజలకు… మోదీ పరిపాలనా విజయాలపై అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు… తమకు లభిస్తున్న లబ్ది ఎవరి వల్ల అనేది విడమర్చి చెప్పడానికి ప్రాధాన్యం ఇచ్చారు.
ప్రభుత్వ స్టిక్కర్ల లోగుట్టు బయట పెట్టేందుకు సోము వీర్రాజు ప్రయత్నం
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు… కేంద్ర ప్రభుత్వ నిధులతో పనులు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం వేసుకుంటున్న స్టిక్కర్ల వ్యవహారం గురించే ఎక్కువగా ప్రచారం చేయాలనుకున్నారు. దీని గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తే.. మొత్తం ప్రభుత్వ బండారం బయట పడుతుందనే వ్యూహంతో ఎక్కువగా ఆ అంశంపైనే దృష్టి సారించారు. చివరికి కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యానికీ జగన్ స్టిక్కర్లు వేసుకుంటున్న వైనాన్ని సోము వీర్రాజు బయట పెట్టారు. కేంద్రం నిధులు లేకుండా రాష్ట్రం ఇస్తున్న.. చేస్తున్న పథకాలు దాదాపుగా లేవు. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సోము వీర్రాజుతో పాటు నేతలంతా విజయవంతం అయ్యారని క్యాడర్ సంతృప్తిగా ఉంది.
మరింత దూకుడుగా ప్రజల్లోకి వెళ్లే వ్యూహం !
నెల ప్రచార కార్యక్రమం సక్సెస్ అయింది… ప్రజల్లో మంచి స్పందన కనిపిస్తోంది కాబట్టి ఇంకా దూకుడుగా ప్రభుత్వంపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. మరోసారి స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు పెట్టాలనే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రధానమంత్రి మోదీ, అమిత్, జేపీ నడ్డా కూడా ఏపీ రాజకీయాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో హైకమాండ్ కూడా కొన్ని ప్రత్యేకమైన ప్రచార కార్యక్రమాలు ఇస్తుందని భావిస్తున్నారు. మొత్తంగా ఇప్పుడు ఏపీ బీజేపీ ఫుల్ యాక్టివ్ గా ఉందని.. ఈ జోరును ఎన్నికల వరకూ కొనసాగించాలని అనుకుంటున్నారు.