సీక్వెల్ మూవీస్ హడావుడి జోరందుకుంది. ఒకప్పుడు సీక్వెల్ తీస్తే ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ ఉండేదికానీ బాహుబలి ఘనవిజయంతో ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. ముఖ్యంగా సౌత్ లో సీక్వెల్ మూవీస్ హడావుడి ఓ రేంజ్ లో ఉంది. బాహుబలి తర్వాత కేజీఎఫ్ సక్సెస్ అయింది. పుష్ప 2పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇదే ట్రెండ్ ని ఫాలో అవుతున్నాడు విజయ్ ఆంటోని. బిచ్చగాడు మూడో పార్ట్ తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు అప్పుడే కథ ఇదేనంటూ స్టోరీ లైన్ వైరల్ అవుతోంది.
2016లో విజయ్ ఆంటోనీ ‘బిచ్చగాడు’ అనే సినిమాలో నటించాడు. ఎలాంటి అంచనాలు లేకుండా తెలుగు తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా ఎవ్వరూ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఊపులోనే ఆ సినిమాకు కొనసాగింపుగా ‘బిచ్చగాడు 2’ వచ్చింది. మొదటి దానికి శశి డైరెక్షన్ చేయగా.. రెండో దానికి విజయ్ ఆంటోనీనే దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడు.భార్య పాతిమా ఆంటోనీతో కలిసి నిర్మించిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబట్టుకుంది. ఇప్పటికే దాదాపు రూ.26 కోట్ల మేరకు గ్రాస్ కలెక్షన్స్ను సాధించిందిన ఈ సినిమా మరో నాలుగుకోట్ల మేర కలెక్షన్స్ వస్తే సేఫ్ జోన్లోకి వచ్చేసినట్టే.
వరుసగా రెండు భాగాలూ హిట్ అవడంతో ‘బిచ్చగాడు’ సిరీస్ లో మరో సినిమాను తీసుకు రాబోతున్నట్లు విజయ్ ఆంటోనీ ప్రకటించాడు. దానికి కూడా తానే దర్శకత్వం వహిస్తాననే క్లారిటీ కూడా ఇచ్చేశాడు. అయితే ‘బిచ్చగాడు’ మూవీలో తల్లి సెంటిమెంట్ హైలైట్ చేసి చూపించారు. రీసెంట్ గా వచ్చిన ‘బిచ్చగాడు 2’ సినిమా బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ చుట్టూ తిరిగింది. మరి మూడో భాగంలో కథ ఎలా ఉండబోతోందో అనే ప్రచారం ఊపందుకుంది. అయితే మూడో భాగంలో బ్రదర్స్ సెంటిమెంట్ ఉండబోతోందని టాక్. ఇప్పటికే కథ సిద్ధమైపోయిందట..త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని 2025లో సినిమా విడుదల అవుతుందని తెలుస్తోంది. ‘బిచ్చగాడు 2’ కంటే పెద్ద బడ్జెట్తో ‘బిచ్చగాడు 3’ సినిమాను చేయబోతున్నాం అని ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు విజయ్ ఆంటోని.