ఇంట్లోంచి బయటకు అడుగుపెడితే చాలు హీరోయిన్లపై కెమెరాలు క్లిక్ క్లిక్ మంటాయి. వాళ్లు కూడా పబ్లిసిటీ కోసం రకరకాల ఫోజులిస్తారు. మీడియా అడిగిన ప్రశ్నలకు ఏవో సమాధానాలు చెప్పేసి వెళ్లిపోతారు. ఈ మధ్యలో జరిగే చాలా గందరగోళాలను అస్సలు పట్టించుకోరు. కానీ అలియా చేసిన ఓపని తెలిస్తే మీరు అవాక్కవుతారు. వెరీ గ్రేట్ అనకుండా అస్సలు ఉండలేరు..
అలియా భట్ కేవలం బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా చాలా బాగా తెలుసు. టాలీవుడ్ గొప్పదనాన్ని ఆస్కార్ వేదికపై నిలబెట్టిన ఆర్ఆర్ఆర్ మూవీలో సీతగా నటించింది. స్టార్ హీరోయిన్ స్టేటస్ ఎంజాయ్ చేస్తోన్న అలియా…RRR, బ్రహ్మాస్త్ర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది.రానున్న రోజుల్లో కూడా తాను నటించిన సినిమాలన్నీ తెలుగులో కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంది. చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ ని ప్రేమ వివాహం చేసుకున్న అలియా ఓ చిన్నారికి జన్మనించింది. ఓ వైపు ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తూనే మరోవైపు కెరీర్లో దూసుకెళ్లిపోతోంది. అలియా భట్ రీసెంట్గా రణ్వీర్ సింగ్తో కలిసి ‘రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ’ అనే సినిమా చేసింది. త్వరలో విడుదల కానున్న ఈ మూవీకి సంబంధించి విడుదలైన పాటలు, పోస్టర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు హాలీవుడ్ మూవీలోనూ నటించేందుకు కూడా ప్లాన్ చేసుకుంటోంది. కెరీర్ సంగతి పక్కనపెడితే అలియా సింప్లిసిటీ పై ఇప్పుడు డిస్కషన్ జరుగుతోంది.
ఫొటోగ్రాఫర్ కి చెప్పు అందించిన అలియా
ముంబైలో తన బంధువులతో కలసి ఓ ఏరియాలో కనిపించిన అలియాను చూసి కెమెరాలు క్లిక్ మన్నాయి. ఫొటోగ్రాఫర్స్ పోటాపోటీగా ఫొటోస్ తీశారు. అస్సలు చిరాకు పడకుండా ఫోజులిచ్చింది. ఫొటోలు తీసే కంగారులో ఓ ఫొటోగ్రాఫర్ చెప్పు జారిపడిపోయింది. కెమెరాల వైపు నుంచి చూపు తిప్పిన అలియా ఆ చెప్పు తీసి చేత్తో పెట్టుకుని ఎవరిది అని అడిగి మరీ చేతికి అందించింది. అది చూసి అక్కడున్న వారంతా షాకైపోయారు. చుట్టూ కెమెరాలున్నప్పుడు హీరోయిన్ల కాన్సన్ ట్రేషన్ ఫొటోలపై ఉంటుంది కానీ అలియా మాత్రం అవేమీ పట్టనట్టే సాధారణంగా స్పందించింది. అలియా సూపర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియో, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.